Jana Reddy to join BJP: జానారెడ్డి బీజేపిలో చేరుతున్నారా ? స్పందించిన బండి సంజయ్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటిన బీజేపిలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలు సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ మరింత నూతనోత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటిన బీజేపిలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలు సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ మరింత నూతనోత్సాహంతో ముందుకు దూసుకెళ్తోంది. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతల్లో ఒకరైన జానారెడ్డి కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కుందూరు జానా రెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డిని డీకే అరుణ ద్వారా పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే విషయమై రఘువీర్ రెడ్డి ( Jana Reddy's son Raghuveer Reddy ) మీడియాతో మాట్లాడుతూ.. '' నాన్న ప్రస్తుతం కేరళలో ఉన్నారని, ఈనెల 7న ఆయన కేరళ నుంచి వచ్చాకే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తాం'' అని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
Also read : GHMC Election results 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై బీజేపి స్పందన..
జానారెడ్డి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వెలువడుతుండటంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay ) స్పందిస్తూ.. జానారెడ్డి నుంచి సమాచారం లేనప్పటికీ.. జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి వేర్వేరు కాదని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలే జానారెడ్డి బీజేపీలో చేరుతున్నారా అనే సందేహాలకు బలం చేకూర్చినట్టయింది అంటున్నాయి రాజకీయవర్గాలు.
ఒకవేళ రఘువీర్ రెడ్డి బీజేపిలో చేరినట్టయితే.. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి నేపథ్యంలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ( Nagarjuna Sagar bypoll ) రఘువీర్‌కే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సైతం జరుగుతోంది.
Also read : GHMC Elections Results 2020: మేయర్ స్థానంపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook