KCR Public Meeting in Jangaon, TRS Youth Heps Ambulance: తెలంగాణ సీఎం కే చంద్రశేఖ‌ర రావు జన‌గామ‌లో పర్యటించారు. జ‌న‌గామ‌లో క‌లెక్ట‌రేట్‌ కొత్త కార్యాల‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అలాగే జ‌న‌గామ టీఆర్ఎస్‌ జిల్లా కార్యాల‌యాన్ని సీఎం ప్రారంభించారు. తర్వాత జ‌న‌గామ‌లో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగలో ఆయన ప్రసంగించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సీఎం కేసీఆర్‌‌ సభకు భారీగా ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అయితే ఈ క్రమంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌లో ఒక అంబులెన్స్ ఇరుక్కుపోయింది. దారి లేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ పరిస్థితి చూసిన టీఆర్ఎస్ కార్యకర్తలు చలించిపోయారు. అంబులెన్స్‌ను పూర్తిగా ఎత్తి.. దాన్ని అలాగే తీసుకెళ్లి మరో రోడ్డుపై పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ యూత్ చేసిన ఈ సాయానికి అంబులెన్స్‌లో ఉన్నటువంటి పేషెంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వం చాటుకున్న టీఆర్‌‌ఎస్‌ యూత్‌ను మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ పోస్ట్‌లు చేస్తున్నారు.



ఇదిలా ఉండగా.. జ‌న‌గామ‌లో కేసీఆర్ భారీ సభతో హైదరాబాద్ - వరంగల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. ట్రాఫిక్‌లో అంబులెన్స్‌తో పాటు పలు వాహనాలు కూడా చిక్కుకపోయాయి. భారీ ఎత్తున సీఎం కేసీఆర్ సభకు జనాలు తరలి రావడం వల్లే ఈ ట్రాపిక్ సమస్య తలెత్తింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుని కాస్త ఇబ్బందులుపడ్డారు. నిడికొండ వద్ద బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.


ఇక జనగామలో కొత్త కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ పలు విషయాలపై మాట్లాడారు. ఈ ఏడు సంవత్సరాల్లో తెలంగాణ ప్రయాణాన్ని అంతా చూశారన్నారు. ఎంతో అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంలో జయశంకర్‌ సార్ లేకపోవడం బాధకరమన్నారు. 


తెలంగాణలో భారీ ఎత్తున ధాన్యం దిగుబడి వస్తోందన్నారు. ఒకప్పుడు 2లక్షల రూపాయలు ఉన్న ఎకరం భూమి విలువ ఇప్పుడు 2 కోట్లకు రూపాయలకు చేరిందన్నారు. తెలంగాణకు కరవు అనేదే రాదన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో అధికార యంత్రాంగం ఎంతో బాబా పని చేస్తుందన్నారు. తెలంగాణలో  అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ఆకాంక్ష అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 


Also Read: మెరిసిన సిరాజ్, శ్రేయాస్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం! సిరీస్​ క్లీన్​స్వీప్​!!


Also Read: ఐదుగురు ఆటగాళ్లపై కన్నేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. వారు చాలా కాస్ట్లీ గురూ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook