Polytechnic Exams: తెలంగాణలో పాలిటెక్నిక్ పరీక్షల రద్దు.. మళ్లీ పరీక్షలకు కొత్త తేదీలు ఇవే!

Polytechnic Exams Canceled: తెలంగాణలో పాలిటెక్నిక్ ఎగ్జామ్స్‌ క్వశ్చన్స్‌ పేపేర్స్ లీక్‌ వ్యవహారం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీ నుంచి పరీక్ష పేపర్లు ముందుగా విద్యార్థుల వాట్సాప్‌లకు చేరండంతో బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఇన్సిట్యూట్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 06:56 PM IST
  • తెలంగాణలో ఈ నెల 8, 9 న జరిగిన పాలిటెక్నిక్ పరీక్షల రద్దు
  • ప్రకటించిన బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఇన్సిట్యూట్ అధికారులు
  • ఈ పరీక్షలను ఈ నెల 15, 16 తేదీల్లో మళ్లీ నిర్వహిస్తామని వెల్లడి
  • స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీ క్వశ్చన్‌ పేపర్స్‌ లీకేజీ వ్యవహారంతో నిర్ణయం
Polytechnic Exams: తెలంగాణలో పాలిటెక్నిక్ పరీక్షల రద్దు.. మళ్లీ పరీక్షలకు కొత్త తేదీలు ఇవే!

Polytechnic Final Year Question Papers Leak: తెలంగాణలో ఈ నెల 8, 9 న జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలను బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఇన్సిట్యూట్ అధికారులు రద్దు చేశారు. ఈ పరీక్షలను ఈ నెల 15, 16 తేదీల్లో మళ్లీ నిర్వహించనున్నారు. బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీ.. పాలిటెక్నిక్ క్వశ్చన్‌ పేపర్స్‌ లీకేజీ వ్యవహారంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణలో ఈ నెల 8 నుంచి పాలిటెక్నిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా 8, 9 తేదీల్లో రెండు పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్స్‌ లీక్‌ అయినట్లుగా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఇన్సిట్యూట్ గుర్తించింది. దీంతో బోర్డ్‌.. ఇతర జిల్లాలోని కాలేజి ప్రిన్సిపల్స్‌ను వెంటనే అలెర్ట్ చేసింది. 

స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీ నుంచి విద్యార్థులకు వాట్సాప్‌ ద్వారా పాలిటెక్నిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు వెళ్లినట్లు బోర్డ్ గుర్తించింది. పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్‌ వాట్సాప్ గ్రూప్స్‌లో చక్కర్లు కొట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత బోర్డ్‌.. ఈ వ్యవహారంపై సదరు కాలేజీపై పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చింది. దీంతో పోలీసులు స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. 

స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీ విద్యార్థులను మరో కళాశాలకు బదిలీ చేస్తూ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఇన్సిట్యూట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే ఆ కాలేజీ ఎగ్జామ్ సెంటర్‌‌ను కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. క్వశ్చన్‌ పేపర్ లీక్‌పై పోలీసులు కూడా మరోవైపు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై సదరు కాలేజీ యాజమాన్యాన్ని కూడా వారు విచారించారు. 

అయితే మెదక్‌లోని చేగుంట పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి విద్యార్థులు పరీక్ష సమయానికి రాకుండా ఫోన్లలో చెక్‌ చేసుకుంటూ ఉండగా ఈ ఘటన బయపడింది. విద్యార్థులపై అనుమానం వచ్చి ఫోన్స్‌ చెక్ చేశారు స్టాఫ్. దీంతో వారి వాట్సాప్‌లో పాలిటెక్నిక్‌ పరీక్ష పత్రాలు కనపడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: Teenmar Mallanna Interview: రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నానంటున్న తీన్మార్ మల్లన్నతో బిగ్ డిబేట్ విత్ భరత్

Also Read: విండీస్ టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News