Janwada rave party case: రాజేంద్ర నగర్ లోని జన్వాడ పార్టీ రేవ్ పార్టీ ఘటన ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా పెనుదుమారంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలతో పాటు, విజయ్ మద్దూరీలపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తొంది.  వీరిలో మరికొందరిపై గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.  ఈ క్రమంలో రాజ్ పాకాలా తెలంగాణ హైకోర్టుకు వెళ్లి రెండు రోజుల పాటు గడువు కావాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించిన మోకిలా పోలీసులు.. ఈరోజు తమ ఎదుట హజరు కావాలని రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే.. రాజ్ పాకాల, విజయ్ మజ్దూరీలను అదుపులోకి విచారిస్తే కీలక విషయాలు బైటకు వస్తాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాజ్ పాకాల తన లాయర్ తో కలసి మధ్యాహ్నాం మోకిలా పోలీసుల ఎదుట హజరుకానున్నట్లు తెలుస్తొంది.   అదే విధంగా మంగళవారం  విజయ్ మద్దూరి నివాసంలో మోకిలా పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తొంది. 



బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మోకిలా పీఎస్‌లో  తన లాయర్ తో కలిసి విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ మోకిల పోలీసుల విచారణ మాత్రం కీలకంగా మారనుందని సమాచారం. ఇదిలా ఉండగా.. గత శనివారం.. రాత్రి జాన్వాడ ఫామ్ హౌస్ లో రాత్రి పూట పెద్ద ఎత్తున డీజే సౌండ్ లు, భారీ లైట్లతో పార్టీ జరుగుతుండటంను స్థానికులు పోలీసులకుసమాచారం ఇచ్చారు. దీంతో దాడులు చేసిన పోలీసులకు పెద్ద ఎత్తున విదేశీ లిక్కర్ తో పాటు, కొన్ని ప్రత్యేకంగా కాయిన్స్ లతో పేకట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.


అంతే కాకుండా.. ఈ ఘటన జరిగినప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ సతీమణి కూడా అక్కడే ఉన్నారని, ఆమెను కూడా మోకిలా పోలీసులు విచారించినట్లు తెలుస్తొంది. మరోవైపు.. ఫాంహౌస్‌ పార్టీలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులకు మోకిలా పోలీసుల నోటీసులిచ్చి విచారణ జరిగిపినట్లు సమాచారం.  ఇప్పటి వరకు ఈ జన్వాడ ఘటనలో.. 9 మందిని పోలీసులు విచారించినట్లు తెలుస్తొంది. ఈరోజు.. ఫాంహౌస్‌ యజమాని రాజ్‌ పాకాలతో పాటు విజయ్‌ విచారణకు సహకరిస్తారా.. లేదా.. అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


Read more: Raj Pakala Party: 'మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు'.. కేటీఆర్ బావ మరిది పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


జన్వాడ పార్టీలో కొకైన్‌ సేవించి, పట్టుబడిన విజయ్‌ మజ్దూరీని పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు ఆయన భార్య పక్కనే ఉన్నారు. ఆమెకు తెలిసిన ఓ మహిళ మొబైల్‌ను విజయ్‌ తన ఫోన్‌ అని చెప్పి, పోలీసులకు అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై తెలంగాణలో మరోసారి రాజకీయాలు కాకరేపుతున్నాయి. బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తుంది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.