KCR and Hemanth Soren: జాతీయ రాజకీయాలే ప్రాతిపదికగా అత్యంత ఘనంగా జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ప్రభావం కన్పిస్తోంది. జార్ఘండ్ ముఖ్యమంత్రి హోమంత్ సోరెన్..కేసీఆర్ మధ్య జరిగిన చర్చలే ఇందుకు ఉదాహరణ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే దేశ రాజకీయాలపై దృష్టి సారించడం ప్రారంభించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేసీఆర్ మధ్య జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి ఆయన తల్లి వైద్య చికిత్స కోసం హేమంత్ సోరెన్..హైదరాబాద్‌కు వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. ప్రగతి భవన్‌లో ఇరువురి మధ్య చాలాసేపు విభిన్న అంశాలపై జరిగిన చర్చలు కూడా ఓ కారణం. 


హేమంత్ సోరెన్-కేసీర్ మధ్య జరిగిన భేటీలో కీలకమైన అంశాలపై చర్చ జరిగింది. త్వరలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించేందుకు ఇద్దరు ముుఖ్యమంత్రులు నిర్ణయించడం విశేషం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఇతర రాష్ట్రాలపై మోదీ అనుసరిస్తున్న ధోరణి ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాలు ఏకమై..కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిన అవసరముందని ఇటు కేసీఆర్ అటు హేమంత్ సోరెన్ నిర్ణయించినట్టు సమాచారం. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు మూడు గంటలకు పైగా ఇరువురి మధ్య కేంద్ర ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై చర్చ సాగింది. 


దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరి, అనుసరిస్తున్న విధానంపై ఇరువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా కేంద్రంపై ఎదురుదాడి ప్రారంభించాలని నిర్ణయించారు. చాలా అంశాల్లో ఇరువురి మధ్య సానుకూల నిర్ణయం జరిగింది.గవర్నర్ వ్యవస్థ ద్వారా పెత్తనం చెలాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రాల్ని అవమానపరుస్తూ..ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. 


Also read: BJP vs TRS : కేసీఆర్, కేటీఆర్‌లవి పచ్చి అబద్దాలు: టీఆర్ఎస్‌పై బీజేపి ఫైర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.