BJP slams KCR, KTR: టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుపై ఫైట్ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాజాగా సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ఆహ్వానంపై మాటల యుద్ధానికి దిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందలేదని ఇటీవల మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిపై ఇప్పుడు ఇరు పార్టీల మధ్య రగడ నడుస్తోంది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఫైర్ అయ్యారు. ఫిబ్రవరి 5న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ వచ్చిన సమయంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆహ్వానం లేదని కేటీఆర్ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్యం బాగోలేదని.. అందుకే హాజరు కావడం లేదని పీఎంవోకు సమాచారం వచ్చిందని గుర్తు చేశారు. సీఎంకు సంబంధించి పీఎంవో నుంచి ఎలాంటి సందేశాలు పోలేదని స్పష్టం చేశారు.
ఇటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తండ్రీకొడుకులు పచ్చి అబద్దాలకు నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు రావొద్దని పీఎంవో నుంచి ఫోన్ రాలేదని స్పష్టం చేశారు. అనారోగ్యం వల్లే వెళ్లడం లేదని సీఎం కేసీఆరే ప్రకటించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని బండి సంజయ్ (Bandi Sanjay) తేల్చి చెప్పారు. మొత్తంగా తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు.
Also read : Jagga reddy sensational comments on Balka suman: బాల్కసుమన్ పై జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు
Also read : TS govt Jobs 2022: తెలంగాణాలో కొలువుల జాతర.. ఎక్సైజ్, రవాణా శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.