JNTU exams 2021: ఇంజనీరింగ్, ఫార్మసీ ఎగ్జామ్స్ వాయిదా వేసిన JNTU
Engineering, Pharmacy final semester exams postponed: హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్టు జేఎన్టీయూ (JNTU) ప్రకటించింది. జేఎన్టీయూ వీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల14 నుంచి జరగాల్సి ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
Engineering, Pharmacy final semester exams postponed: హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్టు జేఎన్టీయూ (JNTU) ప్రకటించింది. జేఎన్టీయూ వీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల14 నుంచి జరగాల్సి ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయంచుకున్నట్టు జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
అయితే, విద్యార్థుల విలువైన సమయం వృథాకాకుండా ప్రస్తుతానికి ప్రాజెక్టు వర్క్స్, వైవా పార్ట్ పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు మొదలుపెట్టారు. పరీక్షలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు విద్యార్ధులకు (JNTU students) చేరవేయడంతో పాటు జేఎన్టీయూ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్‌డేట్ చేస్తామని యూనివర్శిటీ వెల్లడించింది.
Also read : TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు, Late Fee లేకుండా అప్లికేషన్
జూన్ చివరి నాటికి పరిస్థితులు చక్కబడితే, వాయిదా పడిన ఎగ్జామ్స్‌ని (JNTU exams 2021) జులై 1 నుంచి జరపాలని నిర్ణయించుకున్నట్టు చెప్పిన జేఎన్టీయూ అధికారులు.. పూర్తి వివరాలు ఈ నెలాఖర్లో కొవిడ్-19 (COVID-19) పరిస్థితిని మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జులై ఫస్ట్ వీక్‌లో పరీక్షలు పూర్తి చేసిట్టయితే.. 20 లోపు ఫైనలియర్ రిజల్ట్ సైతం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
Also read : TSRJC Cet Cancelled: కోవిడ్19 సెకండ్ వేవ్ ఎఫెక్ట్, టీఎస్ ఆర్‌జేసీ సెట్ రద్దు, టెన్త్ మార్కులు కీలకం
Also read: Gurukulam entrance test: గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook