Jubilee Hills Gang Rape: బాధితురాలి ఫోటోలు, వీడియోలు లీక్ చేసింది అతనే..? పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు..
Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను లీక్ చేసిందెవరనే విషయంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Jubilee Hills Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ఫోటోలు, వీడియోలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో అసలు ఈ ఫోటోలు, వీడియోలు రఘునందన్ చేతికి ఎలా వచ్చాయనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ వీడియోల లీక్‌కి సంబంధించి పోలీసుల తాజా దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
బాధిత బాలికను నిందితులు కారులో తీసుకెళ్తున్నప్పుడు తీసిన వీడియోలను జీహెచ్ఎంసీ కార్పోరేటర్ ఒకరు బయటకు లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తన కుమారుడి పేరు కూడా ఉండటంతో.. కారులో బాలిక తన ఇష్టపూర్వకంగానే వారితో అలా వ్యవహరించిందని చెప్పేందుకే ఈ వీడియోలు లీక్ చేసినట్లు సమాచారం. సదరు కార్పోరేటర్ ఈ వీడియోను పలు సోషల్ మీడియా గ్రూప్స్‌లో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
ఇక ఈ వీడియోలను మీడియాకు విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు, రఘునందన్ రావు తనపై విమర్శలకు గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. తాను మీడియాకు విడుదల చేయకముందే.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని చెప్పారు.
బాధితురాలి ముఖం, పేరు తానెక్కడా రివీల్ చేయలేదని రఘునందన్ తెలిపారు. ఈ కేసులో ఎంఐఎం నేతలను కేసు నుంచి తప్పించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎంఐఎం నేతలను రక్షించేందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తనపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Raghunandan Rao: గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను తప్పించే కుట్ర..తానేవరికీ భయపడను: రఘునందన్‌రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook