Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు...
Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
Jubilee Hills Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేపుతోంది. కేవలం తెలంగాణలోనే కాదు జాతీయ స్థాయిలో ఈ ఘటన ఫోకస్ అవుతోంది.నిందితుల్లో రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు బయటకు పొక్కడంతో రాజకీయంగానూ ఈ ఘటన దుమారం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గ్యాంగ్ రేప్ ఘటనలో ప్రభుత్వ సంస్థకు చెందిన ఓ ఛైర్మన్ కొడుకు ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా బయటకు లీకైన సమాచారం మేరకు... ఆ ఛైర్మన్ వినియోగించే అధికారిక ఇన్నోవా కారులోనే బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు తెలుస్తోంది. ఆ ఇన్నోవా కారుపై 'ప్రభుత్వ వాహనం' అనే స్టిక్కర్ అంటించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ సమీపంలో ఈ కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే కుమారుడు కూడా..? :
గ్యాంగ్ రేప్‌కు పాల్పడినవారిలో సాదుద్దీన్ (18), ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అమేర్ ఖాన్ (18)మేజర్లు కాగా మరో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మైనర్లలో ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారుడు, బల్దియా కార్పోరేటర్ కుమారుడు, సంగారెడ్డి టీఆర్ఎస్ నేత కుమారుడు ఉన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడు లేడని పోలీసులు మొదట చెప్పినప్పటికీ... తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో అతను కూడా ఉన్నట్లు కనిపించింది. దీంతో అతన్ని కూడా నిందితుడిగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేంటీ కేసు :
జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌లో మే 28న మద్యం రహిత పార్టీ జరిగింది. ఆ పార్టీకి మైనర్ బాలిక ఒకరు హాజరయ్యారు. అదే పబ్‌లో ఆమెకు అంతకుముందు పరిచయం లేని వ్యక్తులు కలిశారు. పార్టీ అనంతరం ఆమెను ఇంటి వద్ద దిగబెడుతామంటూ మెర్సిడెజ్ బెంజ్ కారులో ఆమెను ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఓ బేకరీ వద్ద కారును ఆపి.. ఆమెను ఇన్నోవా ఆ కారులోకి మార్చారు. అనంతరం అంతా కలిసి అక్కడి నుంచి ఇన్నోవాలో బయలుదేరారు.ఈ క్రమంలో బాలికపై కారులోనే గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి మే 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Also Read: Pawan Kalyan: చంద్రబాబును పవన్ కల్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?టీడీపీ-జనసేన పొత్తు సాధ్యమేనా?
Also Read: యూపీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 12 మంది మృతి.. చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook