Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాజకీయ చర్చగా మారింది. పవన్ వ్యాఖ్యలను సమర్ధించేలా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడటంతో ఏపీలో పొత్తులు ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. పవన్ చెప్పినట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే విపక్షాలన్ని కలవాలి. అంటే 2014 తరహాలో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఏర్పడాలి. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యేమేనా అన్న చర్చ వస్తోంది. జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతున్న ఏపీ బీజేపీ నేతలు.. టీడీపీ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. సోము వీర్రాజు మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేసేది లేదనే సంకేతం వచ్చేలా పలుసార్లు మాట్లాడారు. కాని ఏపీ బీజేపీలోని కొందరు నేతలు మాత్రం టీడీపీ,జనసేనతో కలిసి పోటీ చేస్తేనే గెలుస్తామని చెబుతున్నారని తెలుస్తోంది.
పొత్తులపై మొదటగా మాట్లాడి చర్చ లేవనెత్తిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సిద్ధమంటూనే టీడీపీకి ఝలక్ ఇచ్చేలా మాట్లాడారు. పొత్తుల విషయంలో గతంలో చాలా సార్లు తగ్గామని.. ఈసారి తగ్గే ప్రసక్తే లేదని పవన్ తేల్చి చెప్పారు. ఇప్పుడు తగ్గాల్సిందే మీరేనంటూ బంతిని టీడీపీ కోర్టులోకి నెట్టారు.
2024లో జనసేన పార్టీనే ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న పవన్.. అయితే సింగిల్ గానా... బీజేపీతో కలిశా అన్నది చెప్పలేమన్నారు.2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నామని, త్యాగాలు చేశామని తెలిపారు. కాని ఇప్పుడు జనసేన పార్టీకి మూడు ఆప్షన్లు ఉన్నాయన్నారు పవన్ కల్యాణ్. బీజేపీ తో కలసి సర్కార్ ఏర్పాటు చేయడం... 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం.. లాస్ట్ ఆప్షన్ జనసేన సింగిల్ గానే అధికారంలోకి రావడం అని చెప్పారు. రాష్ట్రం కోసం 2014 ఎన్నికల్లో తాము తగ్గామని... ఇప్పుడు తగ్గాల్సింది మిగితా పార్టీలేనని గబ్బర్ సింగ్ స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తులోనే ఉన్నామని.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు.
వన్ సైడ్ లవ్ అని గతంలో చంద్రబాబు అన్నారు... ఇప్పుడేమో వార్ వన్ సైడ్ అంటున్నారు.. ఇందులో దేనికి కట్టుబడి ఉంటారో చూద్దామని పవన్ వ్యాఖ్యానించారు. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అన్నారు. తగ్గినవాడే హెచ్చింపబడును అన్న బైబిల్ సిద్ధాంతాన్ని టీడీపీ వంట పట్టించుకుంటే బాగుంటుందని సూచించారు. పవన్ చేసిన ఈ కామెంట్లే ఇప్పుడు చర్చగా మారాయి. టీడీపీని షేక్ చేస్తున్నాయి. పొత్తుల విషయంలో తగ్గాల్సిందేనని టీడీపీకి పవన్ తేల్చిచెప్పారని తెలుస్తోంది. అంతేకాదు సీఎం సీటు విషయంలోనూ చంద్రబాబును.. జనసేన అధినేత బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే టాక్ వస్తోంది. 2024లో జనసేన ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని పవన్ చెప్పారు. తమ కూటమి గెలిస్తే పవనే సీఎం అని బీజేపీ చెబుతోంది. అంటే ఇక చెప్పాల్సింది టీడీపీనే. పవన్ కోరుకుంటున్నట్లు పొత్తు విషయంలో టీడీపీ తగ్గుతుందా.. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. జనసేనతో పొత్తు వరకు ఓకే గాని.. సీఎంగా పవన్ ను ప్రకటించే విషయంలో మాత్రం టీడీపీ వెనక్కి తగ్గగపోవచ్చని అంటున్నారు. టీడీపీ సీనియర్ నేతలు కూడా ఆఫ్ ది రికార్డుగా ఇదే చెబుతున్నారు.
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని టీడీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకు సీఎం సీటు అప్పగించే సాహసం టీడీపీ చేయకపోవచ్చని అంటున్నారు. మరీ టీడీపీ సీఎం సీటు ఆఫర్ చేయకపోతే పవన్ కల్యాణ్ ఏం చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. టీడీపీని బ్లాక్ మెయిల్ చేసేలా పవన్ తీరు ఉందని... చంద్రబాబు నిర్ణయాలను బట్టే పొత్తులు తేలుతాయాని అంటున్నారు. అటు బీజేపీ నేతలు మాత్రం టీడీపీ లేకుండానే జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా పవన్ కల్యాణ్ తాజా ప్రకటన తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి తెస్తుందని చెప్పక తప్పదు.
Read also: Minor Girl Gang Rape: మైనర్ బాలిక కారు వీడియో ఎలా లీకైంది.. రఘునందన్ కు పంపింది ఎవరు?
Read also: KA Paul Hot Comments: ఆ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. కేఏ పాల్ హాట్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook