Telangana Courts: తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. జూన్‌ 2న ఇది ఆవిష్కృతం కానుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. రేపు తెలంగాణవ్యాప్తంగా కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు కొలువుదీరనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుగుణంగా ఈమేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 2014లో రాష్ట్ర ఏర్పాటు తర్వాత పది జిల్లాల్లో మాత్రమే కోర్టులు ఉండేవి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలనా సంస్కరణల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా కోర్టుల్లోనే కార్యకలాపాలు కొనసాగాయి. తాజాగా అన్ని జిల్లాల కోర్టులకు జడ్జీలను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. రేపు తెలంగాణవ్యాప్తంగా రాష్ట్ర ఆవతరణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.


రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని హైకోర్టులు తెలిపింది. ఆ వెంటనే కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టు కొలువుదీరుతాయి. మొత్తం 33 జిల్లాలకు ఏ జిల్లాకు ఆ జిల్లాగా కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్..హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మను కలిసి దీనిపై  చర్చించారు. న్యాయ చరిత్రలో ఒకేసారి 23 కొత్త జిల్లాల కోర్టులు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమని అధికారులు తెలిపారు.


కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో కింది స్థాయిలో కేసుల విచారణ వేగవంతం జరుగుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సత్వర న్యాయం జరుగుతుందంటున్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులకు భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా జిల్లాలకు పోర్టు పోలియో జడ్జీలను హైకోర్టు నియమించింది. న్యాయమూర్తులను సైతం అపాయింట్  చేసింది.


Also read: Krishnakumar Kannath: ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కన్నత్ హఠాన్మరణం... విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ...


Also read:TSPSC Group 1: గ్రూప్ 1 దరఖాస్తులకు గడువు పొడగించిన టీఎస్‌పీఎస్సీ... ఎప్పటివరకంటే...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook