TSPSC Group 1: గ్రూప్ 1 దరఖాస్తులకు గడువు పొడగించిన టీఎస్‌పీఎస్సీ... ఎప్పటివరకంటే...

TSPSC Group 1 Notification: వివిధ కారణాలతో గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువును పొడగిస్తున్నట్లు ప్రకటించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 1, 2022, 08:01 AM IST
  • గ్రూప్ 1కి ఇంకా దరఖాస్తు చేసుకోనివారికి గుడ్ న్యూస్
  • దరఖాస్తుల గడువును పొడగించిన టీఎస్‌పీఎస్సీ
  • షెడ్యూల్ ప్రకారం మే 31 తుది గడువు...
  • తాజాగా మరో 4 రోజుల పొడగింపు...
TSPSC Group 1: గ్రూప్ 1 దరఖాస్తులకు గడువు పొడగించిన టీఎస్‌పీఎస్సీ... ఎప్పటివరకంటే...

TSPSC Group 1 Notification: గ్రూప్-1 పోస్టుల దరఖాస్తులకు టీఎస్‌పీఎస్సీ గడువును పొడగించింది. షెడ్యూల్ ప్రకారం మే 31వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు జూన్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణను పొడగించింది. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టులకు ఇప్పటివరకూ 3 లక్షల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరి రెండు రోజుల్లోనే దాదాపు 60 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా టీఎస్‌పీఎస్సీ గడువు పొడగించడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవగా.. మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే పరీక్షకు మరికొంత గడువు ఇస్తే బాగుంటుందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. జూలై, ఆగస్టులో ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో.. ఆ తర్వాతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించాలని కోరుతున్నారు. అభ్యర్థుల విజ్ఞప్తిని టీఎస్‌పీఎస్సీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చిన తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. దాదాపు ఏడేళ్లుగా నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్ 1తో పాటు ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న మొత్తం 89 వేల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ క్రమంలో ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. 

Also Read: Horoscope Today June 1st 2022: నేటి రాశి ఫలాలు.. గ్రహాల ప్రతికూలతతో ఆ రాశి వారికి అనుకోని కలహాలు...

Also Read: Krishnakumar Kannath: ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కన్నత్ హఠాన్మరణం... విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News