Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం
K Kavitha Illness Rushed To Deen Dayal Upadhyay Hospital: తెలంగాణ నాయకురాలు, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు.
K Kavitha Default Bail: ఢిల్లీ మద్యం కేసులో జైలులో ఉన్న తెలంగాణ నాయకురాలు, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాలుగు నెలల్లో జైలులో ఉంటున్న ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే జైలు అధికారులు ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఆస్పత్రికి తరలించారు. కవిత అస్వస్థతకు గురికావడంతో బీఆర్‌ఎస్ పార్టీలో కలవరం మొదలైంది.
Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే... ఈడీ నుంచి రక్షణ కోసమేనా?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అరెస్ట్‌లతో ఆమె ఢిల్లీలోని తిహార్ జైలులో నాలుగు నెలలుగా ఉన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని బెయిల్ ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా కోర్టులు నిరాకరిస్తున్నాయి. బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా బెయిల్ లభించకపోవడంతో ఆమె ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు ఆమెకు జైలు ఆహారం పడడం లేదు. అంతేకాకుండా ఆమె అనారోగ్య సమస్యలు పెరగడంతో మంగళవారం పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Police Lathi Charge: రాత్రిపూట నిరుద్యోగులపై విరిగిన పోలీస్ లాఠీ.. చిక్కడపల్లి లైబ్రరీ దిగ్బంధం
మధ్యాహ్నం భోజనం అనంతర ఆమె అస్వస్థతకు గురయినట్లు సమాచారం. స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే జైలు అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే కవిత అనారోగ్యంపై బీఆర్‌ఎస్ పార్టీలో కలవరం మొదలైంది. అయితే కవిత అనారోగ్యం గురవడంపై చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలంగా జైల్లో ఉంచడంతోపాటు కుటుంబానికి దూరంగా ఉండడంతో ఆమె మానసిక పరిస్థితిపై పడ్డట్టు కనిపిస్తోంది.
జైలు గదులకు పరిమితం కావడం.. ప్రజా జీవితానికి దూరంగా ఉండడం వంటి వాటితో కవిత జైలు వాతావరణంలో ఉండలేకపోతున్నారు. ఇదే క్రమంలో ఆమె మానసికంగా అస్వస్థతకు గురయినట్లు సమాచారం. కాగా ఇటీవల కవితను ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కలిశారు. ఢిల్లీలో మూడు రోజులు ఉండి బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి