Kalvakuntla Kavitha: హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహులకు అడ్డాగా మారిందని విమర్శించిన కవిత... తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం అని మండిపడ్డారు. కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, 'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అంటూ, ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు...నవంబర్ 29, దీక్షా దివాస్" అంటూ దీక్షా దివాస్ సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ పార్టీ స్పందించిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కవిత ట్వీట్ పై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. '' ఇది దీక్షా దివాస్ కాదని. దగా దివాస్ గా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ.. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం అని కవితకు కౌంటర్ ఇచ్చింది. దొంగ దీక్ష నాటకమాడిన మీ నాయన సీఎం కుర్చీ ఎక్కిండు..చిత్తశుద్దితో ఉద్యమం చేసి, బలిదానాలు చేసిన బిడ్డలకు కనీసం గుర్తింపే లేకపాయే'' అని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తంచేసింది.


అయితే, కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ కౌంటర్ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తంచేసిన కల్వకుంట్ల కవిత.. "రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని అన్నారు. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యేనని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.



"సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తాననే నమ్మకం లేక  కేరళ రాష్ట్రం వాయనాడ్ వెళ్లిన నాయకుడు మీ రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించే ప్రయత్నం చేశారు. తాను నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయినా.. అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీ పార్టీపైనే ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచా" అని కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha ) కౌంటర్ ఎటాక్ చేశారు.


Also Read : YS Sharmila: ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన షర్మిల అరెస్ట్!


Also Read : CM KCR: దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ .. సీఎస్టీ పన్ను బకాయి రద్దు: సీఎం కేసీఆర్


Also Read :  MLA Jagga Reddy: నేను ఏది మాట్లాడినా వివాదమే.. ఈ బురద నాకెందుకు.. జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook