Jagga Reddy Comments On Revanth Reddy: టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసెడింట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏది మాట్లాడినా వివాదమే అవుతుందని.. ఈ బురద అంతా తానేందుకని వ్యాఖ్యనించారు. వచ్చే ఎన్నికలు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే జరుగుతాయన్నారు. రేవంత్‌ను పీసీసీ నుంచి దింపాలనే ఆలోచన ఎవరికీ లేదని స్పష్టంచేశారు. తనకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అలవాటు అని అన్నారు.
'ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయనను తొలగించాలని రేవంత్ రెడ్డి అభిమానులు లేఖలు రాయలేదా..? కాంగ్రెస్ పార్టీ ఎవరి జాగీర్ కాదు. వచ్చే ఎన్నికలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే బరిలోకి దిగుదాం.. అయితే అందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి మాతో మాట్లాడకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమావేశాల్లో ప్రశ్నించినా సరిగా సమాధానాలు చెప్పడం లేదు. చాలా నిర్ణయాలపై సమావేశాలు నిర్వహించలేదు. పీఏసీ సమావేశాలకు అందరూ హాజరయ్యారు.
అసమ్మతి కాంగ్రెస్‌లో సహజం. ఇది అన్ని పార్టీలలో ఉంటుంది. రేవంత్‌ను దించండని ఎవరన్నారు..? కాంగ్రెస్ జగ్గారెడ్డిదో.. లేక రేవంత్ రెడ్డితో కాదు. రేవంత్ రెడ్డి సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. నేను వివాదాలకు పోను. నేను ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతా. అందుకే నా మాటలు వివాదాస్పదంగా మారుతుంటాయి. వివాదాలు సృష్టించి అనవసరంగా బురద అట్టించుకోవడం నాకు ఇష్టం లేదు.. నాకు పీసీసీ పదవి కావాలని ఎప్పుడూ అడుగుతూనే ఉంటా.. కొంతమంది అసమ్మతి తెలియజేస్తే కోవర్టులు అని అంటున్నారు. ఎన్నికల వరకు రేవంత్‌నే పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలనే నేను కోరుతున్నా. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే నేను పూర్తిగా సహకరిస్తా..' అని జగ్గారెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడంపై ఆయన స్పందించారు. మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఆస్తులు సంపాదించుకున్నారని అన్నారు. గత 8 ఏళ్లలో ఆయన ఇంటిపై దాడులు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బలహీనం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. అమిత్ షా, కేసీఆర్‌ల మధ్య సఖ్యత ఉందని.. ఇద్దరు ఒక్కటేనని జగ్గారెడ్డి ఆరోపించారు.
Also Read: Bandi Sanjay: బండి సంజయ్‌కు ఊరట.. పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Also Read: Meerut Students: క్లాస్ రూమ్‌లోనే టీచర్‌కు ఐ లవ్ యూ.. ముగ్గురు విద్యార్థులు అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook