ఖమ్మంలో కంచె ఐలయ్య అరెస్టు
ఖమ్మంలో గొర్రెలకాపుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న మహాసభ కార్యక్రమానికి ప్రొఫెసర్ కంచె ఐలయ్య అతిథిగా హాజరయ్యారు.
ఖమ్మంలో గొర్రెలకాపుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న మహాసభ కార్యక్రమానికి ప్రొఫెసర్ కంచె ఐలయ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సభ నిర్వహించడానికి ఎలాంటి అనుమతి కూడా లేదని తమకు ఫిర్యాదు వచ్చిందని.. వెంటనే సభను ఆపమని ఖమ్మం టౌటౌన్ పోలీసులు నిర్వాహకులకు తెలిపారు. ఆ సమయంలో ఏర్పడిన వాగ్వివాదం వల్ల సభలో రసాభస చోటు చేసుకుంది.
వెంటనే పోలీసులు ఆ సభకు అతిథిగా వచ్చిన కంచె ఐలయ్య పై కేసు నమోదు చేసి.. స్థానిక పోలీస్ స్టేషనుకు తరలించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కంచె ఐలయ్య మాట్లాడుతూ, తాము పోలీసులకు ముందుగానే విషయం తెలియజేసి భద్రత అడిగామని.. కానీ అనుమతి లేదని మా మీదే ఎదురు కేసులు పెట్టి అరెస్టులు చేయడం దారుణమని తెలియజేశారు. ఈ మహాసభ ఎలాగైన మళ్లీ నిర్వహించి తీరుతామని ఆయన అన్నారు.