Telangana Vaccination: కరీంనగర్ రికార్డు- 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
Telangana Vaccination: రాష్ట్రవ్యాప్తంగా టీకా ప్రక్రియ వేగంగా సాగుతోంది. కరీంనగర్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు.
Telangana Vaccination: కరోనా మూడో దశ భయాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా (Corona third wave) సాగుతోంది. కరీంనగర్లో వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
జిల్లాలో 18 ఏళ్లు నిండిన అందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపారు. దీనితో తెలంగాణలో 100 శాతం వ్యాక్సినేషన్ సాధించిన తొలి జిల్లాగా (100 PC vaccination in Karimnagar) కరీంనగర్ రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. ఇక దక్షిణ భారత దేశంలో ఈ ఘనత సాధించిన రెండో జిల్లాగా నిలిచినట్లు వివిరించారు.
ఈ మేరకు జిల్లాల వారీగా జనవరి 25 వరకు ఇచ్చిన టీకా పంపిణీ గణాంకాలను వెల్లడించారు (Harish Rao on Vaccination in Telangana) మంత్రి.
టీకాల పంపిణీ లెక్కలు ఇలా..
కరీంనగర్ జిల్లాలో 18 ఏళ్లు నిండిన జనాభా 792,922 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 794,404 మందికి రెండు డోసుల టీకా ఇచ్చారు. 827,103 మందికి మొదటి డోసు టీకా ఇచ్చారు. (జిల్లాకు వచ్చిన ఇతర ప్రాంతాల వారికీ టీకా ఇవ్వడం వల్ల... జిల్లా జనాభా కన్నా టీకాల సంఖ్య ఎక్కువగా ఉంది.)
కరీంనగర్ తర్వాత ఖమ్మం రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 93 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. జిల్లాలో వ్యాక్సినేషన్‌కు అర్హులైన 18 ఏళ్లు దాటిన జనాభా 1,060,576 మంది ఉన్నారు. అందులో ఇప్పటి వరకు 987,883 మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు.
అత్యల్ప వ్యాక్సినేషన్ ఈ జిల్లాల్లోనే..
కొమురం భీమ్ జిల్లాలో అత్యల్పంగా 59 శాతం వ్యాక్సినేషన్ మాత్రమే నమోదైంది. జిల్లాలో 18 ఏళ్లు పైబడిన జనాభా 390,094 మంది ఉండగా.. అందులో 231,717 మంది మాత్రమే రెండు డోసుల టీకా తీసుకున్నారు.
వికారాబాద్ జిల్లాలోనూ అత్యల్పంగా 61 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. జిల్లాలో 709,526 మంది టీకాకు అర్హులైన 18 ఏళ్లు పైబడిన జనాభా ఉన్నారు. అందులో 434,072 మంది మాత్రమే రెండు డోసుల టీకా తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. జనవరి 25 నాటికి 82 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 27,767,000గా ఉండగా.. అందులో ఇప్పటివరకు 22,653,355 మందికి రెండు డోసుల టీకా (Vaccination Telangana) పూర్తయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook