Farmers Conference In Nampally Exhibition Ground: ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమకు పోయి తిన్న చేపల పులుసే తెలంగాణ ప్రజల కొంప ముంచింది. చేపల  పులుసు, పైసల కోసం ఏపీకి అమ్ముడుపోయిండు. క్రిష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలకే అంగీకరించి సంతకం పెట్టి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిండు. ఎన్నికల టైమొచ్చింది. పోలింగ్ రోజున చేపల పులుసును గుర్తుకు తెచ్చుకోండి. పళ్లు (దంతాలు) పటపట కొరకండి. ఓటుతో కేసీఆర్‌కు బుద్ది చెప్పండి. ఓటమిని గిఫ్ట్ గా ఇవ్వండి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘రైతు సదస్సు’’కు హాజరైన బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రిష్ణా జలాల వాటా, వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటును స్వాగతిస్తూ రైతు సదస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని.. ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం అలుపెరగని కృషి చేశామన్నారు. క్రిష్ణా నీటి వాటాలో తెలంగాణకు కొంప ముంచింది చేపల పులుసేనని.. రాయలసీమలో కేసీఆర్‌కు పెట్టిన చేపల పులుసేనని కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ది అంతా తాను చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అని ప్రచారం చేసుకుంటారని మండిపడ్డారు.


"తెలంగాణకు నీటి కేటాయింపులో తీరని ద్రోహం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్. విభజన సమయంలోనే తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. ఏపీ సీఎంతో లాలూచీ పడి డబ్బులకు కక్కుర్తిపడి 299 టీఎంసీల నీటికే అంగీకరిస్తూ సంతకం పెట్టిన మూర్ఖుడు కేసీఆర్. దానికి సంబంధించిన ఆధారాలన్నీ మా వద్ద ఉన్నాయి. 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నావని నిలదీస్తే నోరుమెదపని మూర్ఖుడు కేసీఆర్. పైగా నీటి కేటాయింపులో కేంద్రం మోసం చేస్తోందంటూ లేఖ పేరుతో ప్రజలను, మీడియాను తప్పుదారి పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్.


నీటి కేటాయింపులు, ట్రిబ్యునల్ ఏర్పాటుపై నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్‌లో నాటి సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై 299 టీఎంసీలకే అంగీకరించిన విషయాన్ని బయటపెట్టడంతో నోరు మూసుకున్న వ్యక్తి కేసీఆర్. అదే సమయంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటేనే ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యమవుతుందని జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేయడంతోపాటు విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించిన కేసీఆర్ మళ్లీ రెండేళ్ళపాటు నాన్చిన తరువాత గతేడాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.


క్రిష్ణా జలాల వివాదాలు, కేటాయింపులపై ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే కనీసం కేంద్రానికి ధన్యవాదాలు కూడా తెలపని మూర్ఖుడు కేసీఆర్. ట్రిబ్యునల్ ఏర్పాటు కాకూడదు.. ప్రజలకు మేలు  జరగకూడదన్నదే కేసీఆర్ ఆలోచన. థ్యాంక్స్ చెబితే నీకేమైతుంది..? ముత్యాలేమైనా రాలుతాయా..? మొన్నటికి మొన్న పాలమూరు ప్రాజెక్టులో ఒక మోటార్ మాత్రమే ఆన్ చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ప్రపంచంలోనే ఇంతకంటే మోసగాడు ఎవరూ లేరు.." అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.


మరోవైపు కేసీఆర్ బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని దుష్ర్పచారం చేస్తున్నాడని.. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఇట్లనే చెప్పాడని అన్నారు. కానీ మీటర్లు పెట్టారా..? కేంద్రం పేరు చెప్పి మీటర్లు పెట్టాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా.. ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు లేకపోయినా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చామన్నారు. ప్రజలకు పోలింగ్ రోజు చేపల పులుసు గుర్తుకు రావాలని.. పండ్లు పటపట కొరికి బీజేపీకి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌ను ఓడించి ఓటమిని గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరారు.


Also Read: Bandi Sanjay: తెలంగాణ ప్రజల కొంప ముంచిన 'చేపల పులుసు': బండి సంజయ్  


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి