Telangana Assembly Elections 2023: ‘‘మీ సమస్యలపై ప్రశ్నించే గొంతుకను నేను.. మీ పిల్లల భవిష్యత్తు కోసం యుద్దం చేసిన. జైలుకుపోయిన. రైతుల కోసం లాఠీదెబ్బలు తిన్న. ఉద్యోగుల కోసం జైలుకుపోయిన. మహిళా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన. మీ సమస్యలపై ఉద్యమిస్తున్న నన్ను భయపెట్టడానికి కేసీఆర్ నాపై ఏకంగా 74 కేసులు పెట్టిండు. బండి  సంజయ్ భయపడతడా? చావునోట్లో తలపెట్టి వచ్చినోడిని. కేసీఆర్ అయ్య, తాత దిగొచ్చిన భయపడేవాడ్ని కాదు.. ప్రశ్నించే బండి సంజయ్ గొంతుకను కాపాడుకుంటారా..? పిసికేసుకుంటారా..? అంతిమ నిర్ణయం మీదే’’ అంటూ ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలను కోరారు. ఈరోజు వివిధ పార్టీలకు చెందిన చెర్లబూత్కుర్ నాయకులు ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. "నేను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులు నాపై అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. నిజానికి కరీంనగర్ ప్రజలకు వారిద్దరూ చేసిందేమీ లేదు. భూకబ్జాలు చేయడం, అవినీతికి పాల్పడటం, వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్లు  చేయడం తప్ప ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.


వాళ్ల లెక్క మేం భూకబ్జాలు చేయలేదు. అవినీతికి పాల్పడలేదు. పోలీస్ స్టేషన్ల లో పని కావాలంటే కమీషన్లు తీసుకోలేదు. వ్యాపారులను బెదిరించలేదు. మేం పేదల కోసం, రైతుల కోసం, స్వేచ్చగా వ్యాపారం చేసుకునేందుకు పోరాటం చేస్తున్నం. కరీంనగర్ ను రక్షించుకోవడానికే మేం పోటీ చేస్తున్నం. 


ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కరీంనగర్ ను ఎంఐఎంకు అప్పగించే కుట్ర చేస్తున్నయ్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తే... అందుకు ప్రతిఫలంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించేలా ఒప్పందం కుదిరింది. గతంలో 12 మంది ఎంఐఎం కార్పొరేటర్లు గెలిస్తేనే ఇండియా  పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే.. నల్లాజెండాలు పట్టుకుని తిరిగిన చరిత్ర ఉంది. మేయర్ పదవి ఇస్తే  ఊరుకుంటారా..? ఇదే జరిగితే రేపటి నుండి బొట్టు పెట్టుకుని, కంకణం పెట్టుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదు... కరీంనగర్ ను రక్షించేందుకే నేను పోటీ చేస్తున్నా.


ఎవరి ప్రజా సమస్యలపై కొట్లాడుతున్నారో... ఎవరు ప్రజల కోసం జైలుకు వెళ్లారో... ఎవరు దోచుకుంటున్నారో ఆలోచించి ఓట్లేయాలి. టీఎస్సీఎస్సీ పేపర్ లీకేజీపై నిరుద్యోగుల పక్షాన పోరాడితే 
కేసీఆర్ అయ్య, తాత వచ్చినా బండి సంజయ్ భయపడడు. నాకు జైళ్లు, కేసులు కొత్తకాదు. 7 సార్లు జైలుకు పోయిన. ప్రజల కోసం పోరాడుతున్నానని నాపై కేసీఆర్ 74 కేసులు పెట్టిండు. ఏనాడూ ఆస్తి కోసం, కుటుంబం కోసం జైలుకు పోలేదు.. ఎవరి కోసం ఇదంతా..? మీకోసం...


మోదీ పాలనలో రోజ్ గార్ మేళా పథకం కింద 6 నెలల్లో 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. నియామకాల్లో, పరీక్షల్లో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదు. మరి కేసీఆర్ పాలనలో చేసిందేమిటి? లీకేజీలు, ప్యాకేజీలు తప్ప.. ప్రజలారా...ఆలోచించండి.. మీకోసం ప్రశ్నించే గొంతుకగా మారిన బండి సంజయ్‌ను కాపాడుకుంటారా..? పిసికేసుకుంటారా..? అంతిమ నిర్ణయం మీదే.. మీకోసం కొట్లాడుతున్న బీజేపీకి మద్దతివ్వాలని కోరుతున్నా. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాం. వెంటనే నోటిఫికేషన్ ఇస్తా. ఏటా జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేస్తాం.." అని బండి సంజయ్ అన్నారు.


Also Read: Samsung Galaxy A25 5G Price: దీపావళి సందర్భంగా సాంసంగ్ గుడ్ న్యూస్‌..మార్కెట్‌లోకి మరో డ్రాప్ నాచ్‌ 5G మొబైల్‌!  


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook