Kaushik Reddy audio tapes, Kaushik Reddy to join TRS: హైదరాబాద్: హుజూరాబాద్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటువేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) టీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే ఇస్తారంటూ టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌ రెడ్డి ఓ యువకుడితో ఫోన్‌లో జరిపిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ వైరల్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ టీపీసీసీకి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. దీంతో కౌశిక్ రెడ్డి వివరణ కోరిన టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఆయనకు తొలుత షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ తర్వాత కూడా కౌశిక్ రెడ్డి వైఖరిలో మార్పు లేకపోగా.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో.. రాజీనామా లేఖను ఆమోదించడం కంటే ముందే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హుజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad by-election) విషయంలో కౌశిక్ రెడ్డి టీఆర్‌‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని, అందుకే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నందు వల్లే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. 


Also read : L Ramana joins TRS party: టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్ రమణ


హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2018 ఎన్నికల్లో ఈటల రాజేందర్‌పై (Etela Rajender) పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి అప్పుడు దాదాపు 60 వేలకుపైగా ఓట్లు పోల్ అయ్యాయి. అయితే, ఈటల రాజేందర్ రాజీనామా నేపథ్యంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అందుకు తగినట్టుగానే హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో కౌశిక్ రెడ్డి భేటీ అవడంతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడం (Kaushik Reddy to join TRS) ఖాయం అనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.


Also read: Komatireddy Venkat Reddy: టీపీసీసీ చీఫ్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, అందుకే ఆవేదన చెందా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook