GHMC Elections: కేసీఆర్-ఒవైసీ భేటీ, కీలకాంశాలపై చర్చ
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్..ఎంఐఎం పార్టీలిప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి సారించాయి. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కేసీఆర్, ఒవైసీలు భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
తెలంగాణ ( Telangana ) అధికార పార్టీ టీఆర్ఎస్ ( TRS ) ..ఎంఐఎం ( MIM ) పార్టీలిప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి సారించాయి. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కేసీఆర్, ఒవైసీలు భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
దుబ్బాక ఉపఎన్నిక ( Dubbaka Bypoll ) లో బీజేపీ ( BJP ) విజయం నేపధ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ అప్రమత్తమైంది. గతంలో జరిగిన ఎన్నికల ఫలితాల్నే పునరావృతం చేసేలా దృష్టి సారించింది. ఇప్పటికే స్థానిక నేతలు, మంత్రులను రంగంలోకి దించింది. ఓవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే...రాజకీయంగా వ్యూహరచన చేస్తోంది. పొత్తులు ఎత్తులపై ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm KCR ) నేతలతో మంతనాలు చేస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ( GHMC Elections )ను అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ( Congress party ) ఇప్పటికే విడతల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇక దుబ్బాక ఉపఎన్నిక విజయంతో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ...75 స్థానాల్లో విజయమే లక్ష్యమని ప్రకటించింది. దుబ్బాక విజయం ఇచ్చిన స్పూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికార పార్టీ మరింత అప్రమత్తమైంది. బీజేపీ నుంచి ముంచుకొస్తున్న ముప్పును అంచనా వేసిన గులాబీ బాస్ కేసీఆర్ ఎత్తులు సైతం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi ) తో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రగతిభవన్ వేదికగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్లు సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో మొత్తం 150 సీట్లకు గాను టీఆర్‌ఎస్ 99, ఎంఐఎం 40 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇరు పార్టీలు ముందుగానే పొత్తు పెట్టుకుంటాయా..విడివిడిగా పోటీ చేస్తాయా అనేది ఇంకా తేలలేదు. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆలోచిస్తోంది. Also read: Telangana: తెలంగాణలో టపాసులపై నిషేధం