CM KCR meeting with cabinet ministers at farmhouse: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. మంత్రులకు సీఎంవో నుంచి అర్జంట్ కాల్స్ రావడంతో.. వాళ్లంతా హుటాహుటిన ఎర్రవెల్లి వెళ్లారు. అందుబాటులో ఉన్న దాదాపు 12 మంది మంత్రులు కేసీఆర్ సమావేశానికి వెళ్లారని తెలుస్తోంది. మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు.. తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని సీఎం ఫాంహౌజ్‌కు వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్ సమావేశానికి వెళ్లారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ, పలువురు అధికారులకు కూడా ఫోన్లు వెళ్లడంతో వాళ్లు కూడా ఎర్రవెల్లి వెళ్లారు. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండగా కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించడం సంచలనంగా మారింది.  


ఇటీవల ఫాంహౌజ్‌లో కేసీఆర్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. ప్రభుత్వ పథకాలు, ప్రజల స్పందనపై పికే టీం సర్వే చేసింది. సర్వే వివరాలను పీకే టీమ్ కేసీఆర్‌కు ఇచ్చిందని తెలుస్తోంది. దానిపైనే మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని సమాచారం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ (CM KCR) ఏం మాట్లాడుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.


Also read : Revanth on Chinna Jeeyar: చినజీయర్‌పై రేవంత్ ఫైర్.. యాదాద్రి ఆగమశాస్త్ర బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్..


Also read : Chinna Jeeyar: సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చినజీయర్ వివరణ...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook