Revanth on Chinna Jeeyar: చినజీయర్‌పై రేవంత్ ఫైర్.. యాదాద్రి ఆగమశాస్త్ర బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్..

Revanth Reddy on Chinna Jeeyar Swamy: చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మక్క-సారలక్కలు కొలువైన మేడారంలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 02:10 PM IST
  • సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • మండిపడుతున్న తెలంగాణ సమాజం
  • చినజీయర్‌పై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి
Revanth on Chinna Jeeyar: చినజీయర్‌పై రేవంత్ ఫైర్.. యాదాద్రి ఆగమశాస్త్ర బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్..

Revanth Reddy on Chinna Jeeyar Swamy: వన దేవతలు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. సామాన్యులు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు చినజీయర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. యావత్ తెలంగాణ సమాజం దేవతలుగా కొలిచి మొక్కే సమ్మక్క-సారలక్కలపై చినజీయర్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జీయర్ వివాదాస్పద వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

'తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి సీఎం కేసీఆర్ తక్షణమే తొలగించాలి. మన భక్తి, విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.' అని రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. ఇదే ట్వీట్‌లో గతంలో సీఎం కేసీఆర్ చినజీయర్‌కు సాష్ఠాంగ నమస్కారం చేసిన ఫోటోను పోస్ట్ చేశారు.

చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మక్క-సారలక్కలు కొలువైన మేడారంలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. చినజీయర్ ఇప్పటికైనా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 
సమతామూర్తి విగ్రహంతో చినజీయర్ వ్యాపారం చేస్తున్నారని.. కానీ మేడారంలో సమ్మక్క సారలక్కల దర్శనానికి ఎటువంటి టికెట్ లేదని మండిపడుతున్నారు.

సమ్మక్క సారలక్కలపై చినజీయర్ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ కూడా స్పందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, జీయర్ మద్దతుదారులు మాత్రం.. ఎప్పటిదో పాత వీడియోను తెర పైకి తీసుకొచ్చి అనవసర రాద్దాంతం చేస్తున్నారని వాదిస్తుండటం గమనార్హం. 
 

Also Read: Mahesh Babu New Look: సెకండ్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్.. ఇయర్‌బడ్స్‌ పగిలిపోయడం ఖాయం! మహేష్ లుక్ అదిరిపోలా!

Also Read: Harbhajan Singh: హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News