కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెర్ర చేశారు.  తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అవలంభిస్తున్న తప్పుడు విధానాల వల్ల దేశంలో హింస పెచ్చరిల్లిపోతోందని విమర్శించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA2019కు వ్యతిరేకంగా ఇప్పటి వరకు 7 రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాయని తెలిపారు. అంతే కాదు 8వ రాష్ట్రంగా తెలంగాణ కూడా అసెంబ్లీ తీర్మానాన్ని పంపిస్తుందని చెప్పారు.  CAA, NPR, NRC బిల్లులను తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు కేసీఆర్. అవగాహనతోనే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తనతో సహా కోట్ల మందికి ఈ దేశంలో పుట్టిన తేదీ సర్టిఫికెట్లు లేవని తెలిపారు. అలాంటి వారి పరిస్థితి ఏంటని తెలంగాణ సీఎం ప్రశ్నించారు.


'కరోనా' తగ్గిస్తానంటున్న 'కంత్రీ బాబా'


బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దేశద్రోహిగా ముద్ర వేస్తున్నారని.. ఇది మంచిది కాదని తెలిపారు కేసీఆర్. సీఏఏ గొడవల్లో ఇప్పటి వరకు 50 మంది చనిపోయారని.. ఇలాంటి తాత్కాలిక విద్వేషాలను రెచ్చగొట్టడం దేశానికి మంచిది కాదన్నారు.  దీన్ని హిందూ- ముస్లిం సమస్యగా చూడవద్దని కోరారు. దేశ ప్రజల సమస్యగానే అందరూ అర్ధం చేసుకోవాలన్నారు కేసీఆర్. CAA 2019 చట్టం కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారత దేశం పరువు, ప్రతిష్ట దెబ్బతింటోందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. దీన్ని రాజకీయం చేస్తున్న కుటిల రాజకీయ పార్టీలు దేశానికి అవసరమా అని ప్రశ్నించారు.


 


పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో పాకిస్తాన్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి పాకిస్తాన్ కు చాలా మంది వలసలు వెళ్లారని కేసీఆర్ తెలిపారు. బంగ్లాదేశ్ విడిపోయిన సమయంలోనూ చాలా మంది అక్కడి నుంచి ఇండియాకు వచ్చారని తెలిపారు.  అంతే కాదు ధూల్ పేట్ లో ఉన్న చాలా మంది తెలంగాణ ప్రజలు కాదని అన్నారు. బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్.. లోధా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. Read Also: తెలంగాణలో మూడో కరోనా కేసు  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..