'కరోనా' తగ్గిస్తానంటున్న 'కంత్రీ బాబా'

ప్రపంచవ్యాప్తంగా 'కరోనా వైరస్' ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. 144 దేశాలకు విస్తరించిన ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయంతో గజగజా వణికిపోతున్నారు. చైనా సహా ఇటలీ లాంటి దేశాల్లో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది.

Last Updated : Mar 16, 2020, 11:42 AM IST
'కరోనా' తగ్గిస్తానంటున్న 'కంత్రీ బాబా'

ప్రపంచవ్యాప్తంగా 'కరోనా వైరస్' ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. 144 దేశాలకు విస్తరించిన ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భయంతో గజగజా వణికిపోతున్నారు. చైనా సహా ఇటలీ లాంటి దేశాల్లో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. దీంతో కరోనా వైరస్ కు మందులున్నాయనే ప్రచారం ముమ్మరమైంది. ఇప్పుడు ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని  కొంత మంది దొంగబాబాలు పుట్టుకొస్తున్నారు.  

కరోనా వైరస్ తగ్గిస్తామంటూ అమాయక జనానికి వల విసురుతున్నారు. 'కరోనా వైరస్' వచ్చిన వారికి తగ్గిస్తాం. .  వైరస్ సోకని వారికి రాకుండా చేస్తాం. .  ఇదీ దొంగ బాబాలు చెబుతున్న తీరు. ఐతే ఈ దొంగ బాబాలు. . కరోనా వైరస్ రాకుండా  లేదా తగ్గకుండా ఏం చేస్తారో తెలుసా..? కరోనా వైరస్ కు ముకుతాడు వేసేలా తాయత్తు కడతారట. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఇలాంటి దొంగ బాబ ఒకడు పుట్టుకొచ్చాడు.  

Read Also: తెలంగాణలో మూడో కరోనా కేసు

ఈ ఫోటోలో కనిపిస్తున్న తావీజ్ బాబా.. పేరు..  మహ్మద్ సిద్ధిఖీ. లక్నోలో దొంగ బాబా అవతారం ఎత్తిన ఈ వ్యక్తి  ఇప్పుడు అమాయక జనానికి కరోనా వైరస్ పేరుతో వల విసురుతున్నారు. కేవలం 11రూపాయలిస్తే చాలట. కరోనా వైరస్ వచ్చిన వారికి తగ్గిస్తాడట. అలాగే రాని వారికి తాయత్తు కడతాడట. ఊరూరా తన ఏజెంట్లను పెట్టి. . 11 రూపాయలకే కరోనా వైరస్ తాయత్తు పేరిట ప్రచారం చేస్తూ అమాయక జనం దగ్గర డబ్బులు దోచుకుంటున్నాడు. తాయత్తు కట్టించుకున్న వారు.. తమకు నచ్చినంత కట్నంగా చదివించుకోవచ్చని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడట. 

కొందరు చదువుకున్న యువత.. ఈ దొంగ బాబా అవతారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇలాంటి దొంగ బాబాల మాటలు నమ్మి మోసపోవద్దని.. కరోనా వైరస్ పై భయాందోళన చెందవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News