Harish Rao Assembly Speech: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి వైఫల్యాలను బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రస్థాయిలో నిలదీస్తోంది. హామీల అమల్లో విఫలమవడం.. అస్తవ్యస్త పాలనపై విమర్శలు చేసింది. అసెంబ్లీ బయట, లోపల మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం అసెంబ్లీ లాబీలో రేవంత్‌ రెడ్డిపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్‌ అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా?' అని ప్రశ్నించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rajashekhar: సినీ హీరో రాజశేఖర్‌ సంచలనం.. ట్విటర్‌లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీత


 


'రేవంత్ రెడ్డి సబ్జెక్టు మాట్లాడకుండా శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారు. మేడిగడ్డ నుంచి నీటి ఎత్తిపోతల వ్యవహారంలో రిటైర్డ్ ఇంజనీరింగ్‌ల రిపోర్ట్ ను తప్పుగా చదివారు. మోటర్లకు మీటర్లు అంటూ లెటర్లోని లైన్ మొత్తాన్ని తప్పించి చదివి అబద్దాలు చెప్పారు. ఉదయ్ పథకంతో రూ.30 వేల కోట్లు వస్తుండే అని చెప్పే సమయంలో ముఖ్యమంత్రి కలగజేసుకుని అధికారులు సంతకాలు పెట్టారని లెటర్ చదివారు. మంద బలం కుర్చీ బలంతో శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: KT Rama Rao: రేవంత్‌ పరాన్నజీవి.. పేమెంట్‌ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌


 


ఈ విషయంలో 'శాసనసభ సభాహక్కులు, వాయిదా తీర్మానం కోరుతాం.. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం' అని హరీశ్ రావు తెలిపారు. 'పోతిరెడ్డిపాడును దగ్గరుండి బొక్క పెట్టించారు అని రేవంత్ ఆరోపణ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మేము రాజీనామా చేసిన తర్వాతనే పోతిరెడ్డి పాడుకు జీఓ విడుదల అయ్యింది' అని గుర్తుచేశారు. 'పులిచింతల ప్రాజెక్టు, నక్సలైట్లతో చర్చలు తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు 2005లో మంత్రి పదవులను ఒదులుకున్నాం' అని హరీశ్ వివరించారు.


ఎల్‌ఆర్‌ఎస్‌పై
'కోమటి రెడ్డి రాజగోపాల్ ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేయాలని గతంలో కోర్టులో కేసు వేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు డబ్బులు వసూలు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడేమో రూ.14 వేలు ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ ధరలను రూ.18 వేలకు పెంచి వసూల్ చేద్దాం అనుకుంటున్నారు' అని హరీశ్‌ రావు తెలిపారు.


రేవంత్‌పై
తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌ రెడ్డి ఎక్కడా లేడని హరీశ్ రావు తేల్చి చెప్పారు. 'ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాకు సిద్ధపడితే రేవంత్ జిరాక్స్ పేపర్ కూడా స్పీకర్ కు ఇవ్వలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా రైఫిల్ పట్టుకుని బెదిరించిన వ్యక్తి రైఫిల్ రెడ్డి అయ్యాడు. ఒక్కనాడైనా జై తెలంగాణ అనని వ్యక్తి ఆయన. కేసీఆర్ పుణ్యం దయ వల్ల రేవంత్ పదవులను అనుభవించాడు' అని రేవంత్‌పై విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్‌ పని ఖతం అంటున్నారు ఎన్నటికైనా మళ్లీ బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తది' అని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.'1984 తర్వాత నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ రాలేదు. పొత్తులతోనే నెట్టుకొస్తోంది. చీమలు పెట్టిన పుట్టలో పాములు వెళ్లినట్టు అసలు కాంగ్రెస్ వాళ్లకు పదవులు లేవు' అని హరీశ్ రావు తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter