Rajashekhar: సినీ హీరో రాజశేఖర్‌ సంచలనం.. ట్విటర్‌లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీత

Actor Rajashekhar Questions GHMC Officers And GHMC Mayor: పోలీస్‌ సినిమాలతో ఫైర్‌గా కనిపించే సినీ నటుడు రాజశేఖర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ట్విటర్‌ వేదికగా నిలదీశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 29, 2024, 04:17 PM IST
Rajashekhar: సినీ హీరో రాజశేఖర్‌ సంచలనం.. ట్విటర్‌లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీత

Rajashekhar Drainage Leak: తన సినిమాల్లో అవినీతి, ప్రజా సమస్యలపై నిలదీసిన సినీ నటుడు.. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. అలసత్వాన్ని నిలదీసిన హీరో నిజ జీవితంలోనూ నిలదీశారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఆ హీరో ఎవరో కాదు సీనియర్‌ హీరో రాజశేఖర్‌. తన ఇంటి సమీపంలో ఉన్న సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ట్విటర్‌ వేదికగా నిలదీశారు.

Also Read: KT Rama Rao: రేవంత్‌ పరాన్నజీవి.. పేమెంట్‌ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు రాజశేఖర్‌ నివసిస్తున్నారు. అయితే అక్కడ ఎప్పటి నుంచో డ్రైనేజీ సమస్య ఉంది. కొన్నాళ్లుగా ఆ సమస్యను పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను జీహెచ్‌ఎంసీ పట్టించుకోకపోవడంతో రాజశేఖర్‌ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే 'ఎక్స్‌' వేదికగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

ట్విటర్ ఇలా..
'జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 70లోని అశ్వినీ హైట్స్‌ వద్ద డ్రైనేజీ లీక్‌ సమస్య ఉంది. ఈ సమస్య చాలా రోజుల నుంచి వేధిస్తున్నా జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదు. వెంటనే చర్యలు తీసుకోవాలని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీని విజ్ఞప్తి చేస్తున్నా' అని రాజశేఖర్‌ 'ఎక్స్‌' ట్విటర్‌లో పోస్టు చేశారు. దాంతోపాటు సమస్యకు సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు.

వర్షాకాలం కావడంతో హైదరాబాద్‌లో డ్రైనేజీ సమస్య వేధిస్తోంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతూ రోడ్లపై వరద పారుతోంది. దీంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా జీహెచ్‌ఎంసీ మొద్దు నిద్ర వీడడం లేదు. స్థానికులే కాకుండా వీఐపీలు ఉండే జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో కూడా ఇదే సమస్య ఉంది. మరి సినీ నటుడు రాజశేఖర్‌ సమస్య పరిష్కారమవుతుందా? లేదా చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x