తెలంగాణ ప్రభుత్వం రైతు పెట్టుబడి పథకం (ఎఫ్ఐఎస్ఎస్) కింద వ్యవసాయ బడ్జెట్ లో రైతులకు 12వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పథకం క్రింద ఖరిఫ్ సీజన్ నుండి ప్రతి రైతు ఎకరానికి రూ.4,000 లబ్దిపొందుతాడు. జమచేసిన మొత్తం సొమ్మును నవంబర్ లో యాసంగి సీజన్ లో చెల్లిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజేంద్రనగర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు సమన్వయ సమితి సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రసంగిస్తూ,'ఈ పథకాన్ని రాష్ట్ర ప్రజలందరూ అభినందించారు.కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ కూడా మెచ్చుకున్నారు. ఈ తరహా పథకం దేశంలోనే ప్రప్రథమమని ఆయన కొనియాడారు' అని తెలిపారు.   


"వ్యవసాయం అనేది జీవన మార్గం. దీనిని వ్యాపార కార్యకలాపంగా పరిగణించలేము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక ముందు, గత ప్రభుత్వాలు రాష్ట్ర రైతుల పట్ల వివక్ష, వ్యవసాయం పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభించాయి. రైతుల ఆత్మహత్యలకు, నిరాశలకు కారణమయ్యాయి" అని ఆయన చెప్పారు. ఎఫ్ఐఎస్ఎస్ స్కీమ్ గురించి కొంతమంది రాజకీయ నాయుకులు చెడు ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు.


‘‘రైతు పెట్టుబడి పథకానికి బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయిస్తాం. రైతులకు ఇవ్వబోయే పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో ఖరీఫ్, యాసంగి సీజన్ లకు ఇస్తాం. రైతులకు ప్రీ-లోడెడ్ బ్యాంకు కార్డులు అందజేస్తాం. ఈ కార్డుల్లో ఎప్పటికప్పుడు నగదు క్రెడిట్‌ అవుతుంది’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. 1.62 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు విస్తరించి ఉన్న రాష్ట్రంలో 1.42 కోట్ల మంది రైతులకు పంట పెట్టుబడులు సహాయపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు.