హైదరాబాద్: భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కొవ్వొత్తి వెలిగించారు. కొవ్వత్తి పట్టుకుని కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన ఇంటి నుంచే ఫేస్ బుక్ ద్వారా నుంచి మాట్లాడారు. కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో 130 కోట్ల భారతీయులు, ప్రపంచం పోరాడుతుందని ఇందులో విజయం సాధించాలని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పట్టుదల అంకితభావం సేవాభావం ఉండాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ  విపత్కర పరిస్థితుల్లో వైరస్ మహమ్మారితో ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులకు, వారి కుటుంబ ధన్యవాదాలు తెలిపారు. 


కొన్ని ప్రాంతాల్లో వైద్య సేవ అందిస్తున్న డాక్టర్లపై, సిబ్బందిపై  దాడులు చేయడం బాధాకరమని, దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ఆదేశించారు. 80 శాతం కేసులు  ఢిల్లీ మర్కజ్ వల్లే పెరిగాయని, ఆ సభల్లో పాల్గొన్న వారు మీ కుటుంబాల కోసమైనా బయటకు వచ్చి ప్రభుత్వాలకు సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..