హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలులో ఉన్న లాక్ డౌన్ ను విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ.. మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. కాగా రాష్ట్రంలో కరోనా సోకి చికిత్స తర్వాత 11 మంది కోలుకున్నారని, వారిని సోమవారం నాడు డిశ్చార్జ్ చేస్తున్నామని నేడు ప్రగతి భవన్లో విలేఖర్ల సమావేశంలో తెలిపారు. కాగా మిగిలిన 58 మందిని కూడా పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ అని తేలిన తరవాతనే క్రమంగా డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 Read Also: మళ్ళీ పెరిగిన చికెన్, గుడ్డు ధరలు....


రాష్ట్రంలో మొత్తం 25,937 మంది పర్యవేక్షణలో ఉన్నారని, భారతదేశ లాక్ డౌన్ ను అంతర్జాతీయ పత్రికలు ప్రశంసిస్తున్నాయని, భారత ప్రజలకున్న ఒకే ఒక్క ఆయుధం స్వీయ నియంత్రణ అని పేర్కొన్నారు. ఇప్పుడున్న వారిలో మార్చి 30 నుంచి క్వారంన్టైన్ గడువు పూర్తిచేసుకుని ఆరోగ్యంగా ఉన్న వారందరినీ డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. 


Also Read: ధోనీపై విమర్శలు.. తీవ్రంగా స్పందించిన సాక్షి..


రాబోయే మరికొన్ని రోజుల్లో రైతులు పంట కొత్త మొదలుపెట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని, మార్కెట్ యార్డులకు తీసుకురావద్దని, తమ దగ్గర్లోని ఐకేపీ సెంటర్లో టోకెన్ ద్వారా అమ్మకాలు చేసుకోవాలని, కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా స్వీయ పరిశుభ్రత పాటించాలని సూచించారు. కాగా రైతులకు ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించబడతాయని, లాక్ డౌన్ ఖచ్చితంగా పాటించాలని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..        


Read Also: కరోనా చేస్తున్న నష్టాన్ని పూడ్చలేమోనని ఆ దేశ ఆర్ధిక మంత్రి ఆత్మహత్య ..