బెర్లిన్: కరోనావైరస్ మహమ్మారిపై ప్రస్తుత ఆందోళన, తద్వారా పరిణామాలపై తీవ్ర కలత చెంది వచ్చే ఆర్థిక పతనాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్ధంకాని నేపథ్యంలో జర్మనీలోని, హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షాఫెర్ ఆత్మహత్య చేసుకున్నాడు. షెఫర్ (54) శనివారం రైల్వే ట్రాక్ సమీపంలో చనిపోయాడని, వైస్‌బాడెన్ ప్రాసిక్యూషన్ కార్యాలయ వర్గాల ప్రకారం ఆత్మహత్యయే చేసుకుని ఉంటాడని నమ్ముతున్నట్లు అన్నారు.
Also Read: ధోనీపై విమర్శలు.. తీవ్రంగా స్పందించిన సాక్షి..
కాగా ఇదే అంశంపై ఆ దేశ ప్రధానమంత్రి ప్రధాన మంత్రి వోల్కర్ బౌఫియర్ మాట్లాడుతూ.. మేము షాక్ లో ఉన్నామని, మేము ఈ మరణంపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా హెస్సీ అనే రాష్ట్రం జర్మనీ యొక్క ఆర్థిక రాజధాని, అయితే ఇది ఫ్రాంక్‌ఫర్ట్‌కు నిలయం. ఇక్కడ డ్యూయిష్ బ్యాంక్, కమెర్జ్‌బ్యాంక్ వంటి ప్రధాన కార్యాలయాలతోపాటు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఫ్రాంక్‌ఫర్ట్‌లో కూడా ఉంది.
Read Also: మళ్ళీ పెరిగిన చికెన్, గుడ్డు ధరలు....
UPDATE: The finance minister of the German state of Hesse, Thomas Schäfer, apparently committed suicide in despair about the scale of the state response required to tackle the #coronavirus crisis, initial investigations suggest. https://t.co/VfYM1GQbhs
— DW News (@dwnews) March 29, 2020
గత 10 సంవత్సరాల పాటు హెస్సీ రాష్ట్రానికి ఫైనాన్స్ చీఫ్ గా ఉన్న షాఫెర్, కరోనా మహమ్మారి కలిగిస్తున్న ఆర్ధికనష్టాన్నీ ఎదుర్కోవటానికి కంపెనీలు, కార్మికులకు రాత్రి, పగలు దోదాదపడిన విషయాన్ని బౌఫియర్ గుర్తుచేసుకున్నాడు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సన్నిహితుడైన బౌఫియర్ మాట్లాడుతూ ఈ రోజు మనందరికీ దుర్దినమని, మరణవార్త వినగానే తీవ్రంగా ఆందోళన చెందానని, ఈ కష్ట సమయంలో ఆయన లేని లోటును పూడ్చలేనిదని అన్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..