TS News: ఖమ్మంలోని (Khammam) బ్రాహ్మణ బజారులో విషాదం చోటుచేసుకుంది. భారీ వృక్షం కూలి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం ఆరుగురు చిన్నారులు బ్రాహ్మణ బజారులోని (Brahmana Bazaar) ఖాళీస్థలంలో ఆడుకునేందుకు వెళ్లారు. ఈక్రమంలో అక్కడున్న ఓ చెట్టు కూలి పక్కనున్న గోడపై పడింది. దీంతో గోడ కిందపడి దిగాంత్‌ శెట్టి (11), రాజ్‌పుత్‌ ఆయుష్‌ (6) మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని మేయర్‌ నీరజ, ఏఈ నర్సయ్య, అగ్నిమాపక అధికారులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా, గత డిసెంబర్ లో తమిళనాడులో ఇలాంటి ఘటనలోనూ ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. తిరునల్వేలి (Thirunelveli) జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బాత్‌రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  


Also Read: Hyderabad: పోలీసు శాఖలో కరోనా కలకలం.. గ్రేటర్ పరిధిలో 72 మందికి పాజిటివ్!


అయితే అక్టోబర్ లోనూ ఇలాంటి ఘటనే తెలంగాణలోని గద్వాల్ లో జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లా ( jogulamba gadwal) జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో ఓ ఇంటి గోడకూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook