Kishan Reddy News: తెలంగాణ సీఎం, గవర్నర్ కు మధ్య గ్యాప్ రావడానికి కారణం అతడే!
Kishan Reddy News: తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఎవరో తెలిసిపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన వల్లనే గవర్నర్, సీఎం మధ్య ఈ వివాదం చెలరేగిందని స్పష్టం చేశారు.
Kishan Reddy News: తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్‌కు కారణమెవరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈటల రాజేందర్ వల్లే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం కేసీఆర్ ఓ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నాడని.. కానీ గవర్నర్ దానికి నిరాకరించారన్నారు. దీంతో గవర్నర్‌పై కేసీఆర్ కు కోపం వచ్చిందన్నారు. అందుకే గవర్నర్ ను కావాలని అవమానిస్తున్నారన్నారని ఆయన తెలిపారు.
మేడారం జాతరకు వచ్చిన గవర్నర్ కు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకకపోవడం దారుణమని చెప్పారు కిషన్ రెడ్డి. ఆ కార్యక్రమానికి గవర్నర్ తో పాటు కలెక్టర్, ఎస్పీ రాకపోవడం అవమానకరమన్నారు. వరంగల్ పర్యటన సందర్భంగా వేయి స్తంభాల గుడిని సందర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విధంగా స్పందించారు.
అటు నిధుల అంశంపై కేంద్రంపై.. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి కేంద్రం అన్నివిధాలుగా సాయం చేస్తోందన్నారు. నిధులు దశలవారీగా వస్తాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని.. ప్రజలే ఆ పార్టీకి బుద్దిచెబుతారన్నారు. రాజ్యాంగంపై ప్రమాణంచేసిన కేసీఆర్, కేటీఆర్.. దిగజారి మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ మెప్పుకోసం టీఆర్ఎస్ నేతలు కూడా అలాగే తయారయ్యారని ఫైరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు జరిగే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
భారత్ త్వరలోనే కరోనాను జయిస్తుందన్నారు కిషన్ రెడ్డి. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా వెనకబడ్డ జిల్లాల అభివృద్ధిపై ప్రధాని దృష్టిపెట్టారన్నారు. ఘంటసాల శతాబ్ధి ఉత్సవాలను కేంద్రం నిర్వహిస్తుందని.. అలాగే జూలై 4న అల్లూరి 125 వ జయంతిని కూడా ఏపీలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. దీనికి ప్రధాని మోడీ హాజరవుతారని కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read: TIMS Hospitals: హైదరాబాద్ నలుదిక్కులా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.