Kishan Reddy to KCR over Crop Compensation: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అనేకమంది వరదల్లో చిక్కుకుపోయారు. కొందరు గల్లంతయ్యారు. ఇండ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. పంటలు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు గల్లంతయ్యాయి అంటూ మోరంచపల్లి గ్రామస్తులకు ఎదురైన విషాదాన్ని తల్చుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మోరంచపల్లి గ్రామం వరదలకు చాలా నష్టపోయింది. ఇవాళ ఉదయమే ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో ఢిల్లీ నుంచి బయలుదేరి మోరంచపల్లికి వచ్చాను. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వరద బాధితులకు అండగా నిలబడుతుంది. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాలో 4 లక్షల రూపాయల్లో 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అని అక్కడి వరద బాధితులకు కిషన్ రెడ్డి తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో సేవలు అందించే రాష్ట్ర విపత్తుల నిర్వహణ యంత్రాంగం వద్ద రూ.900 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి. ఇందులో 75 శాతం నిధులను కేంద్రమే అందించగా మిగతా 25 శాతం నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానివి అని గుర్తుచేశారు. అవసరమైతే ఆ నిధులను వినియోగించి అయినా సరే బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 


రేపు కేంద్ర బృందాలు తెలంగాణకు వస్తున్నాయి. వాళ్లు ఇక్కడ పర్యటించి.. ఇక్కడి నష్టాన్ని పరిశీలిస్తారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పంట నష్టం నివేదికను కూడా కేంద్రానికి అందజేస్తారు అని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అందించే నివేదికకు తగినట్లుగా మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అని కిషన్ రెడ్డి తెలిపారు.


బాధితులకు అండగా ఉంటాం... 
భారీ వర్షాలు, వరదలు కారణంగా రైతులు ఎంతో నష్టపోయారు. మోరంచపల్లి గ్రామస్తులు సర్వం నష్టపోయారు. ఈ విషయాన్ని రాజకీయాలు చేయకుండా.. అందరం కలిసి ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది. మా పార్టీ తరఫున ఇక్కడి వరద బాధితులకు భోజన వసతులతోపాటు, బియ్యం పప్పులు, ఇతర నిత్యావసరాల సరుకులు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోసం వేచిచూడకుండా మోరంచపల్లికి జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాన్ని చూసి వెంటనే స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కేంద్ర బృందాన్ని అత్యవసరంగా తెలంగాణలో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


ఇది కూడా చదవండి : TS Health Director Srinivasa Rao Political Entry: పొలిటికల్ ఎంట్రీపై మరోసారి డీహెచ్ సంచలన వ్యాఖ్యలు


ఆరోజు బాధితుల నుంచి ఫోన్ వచ్చింది. భూపాలపల్లి జిల్లా బీజేపీ నాయకురాలు కీర్తిరెడ్డి నుంచి ఫోన్ రాగానే.. కలెక్టర్‌తో మాట్లాడాను. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో మాట్లాడటం... వారు  వెంటనే స్పందించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, హెలికాప్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని.. ఆ హెలికాప్టర్ల ద్వారానే స్థానికులు ప్రాణాలతో బయటపడ్డారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. కేంద్రం 75 శాతం నిధులున్న SDRFలో ప్రస్తుతం ఉన్న 900 కోట్లకు పైగా నిధులను తక్షణమే ఈ వరద సహాయం కోసం ఖర్చుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చదవండి : Jitta Balakrishna Reddy: కేసీఆర్, బీజేపి ఒక్కటే.. మరోసారి జిట్టా సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి