Central Officials Team Will Visit Telangana: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో కురిసిన వర్షాల కారణంగా.. పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన కేంద్ర అధికారుల బృందాన్ని తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, స్పేస్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉండనున్నారు.
ఈ అధికారుల బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ) సలహాదారుడు కునాల్ సత్యార్థి నాయకత్వం వహించనున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర అధికారుల బృందం సోమవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనుందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రాంతాల్లో జరిగిన నష్టంపై కేంద్ర అధికారుల బృందం సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనావేయడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న వివరాలను సేకరిస్తుందన్నారు. వీటన్నింటిని జతపరుస్తూ అధికారుల బృందం నివేదిక తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుందని వెల్లడించారు.
"ఉమ్మడి వరంగల్ జిల్లా వరద బాధిత ప్రాంతాలను పరిశీలించేందుకు కిషన్ రెడ్డి వెళ్లగా.. జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాణ నష్టం జరిగిందన్నారు. వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని.. పంటలే కాకుండా పశువులు ప్రాణాలను కోల్పోయాయని అన్నారు. రోడ్లు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో బీజేపీ బృందాలు వరద సహాయ కేంద్రాల్లో తిరుగుతూ.. సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మరో మూడురోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్ర నాయకులతో పాటు నిన్న కేంద్ర హోంమంత్రిని కలిసి తెలంగాణలో కురిసిన వర్షాలతో ఏర్పడిన నష్టాన్ని వివరించాం. వెంటనే స్పందించిన హోంమంత్రి కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపిస్తామని చెప్పారు. రేపు కేంద్ర బృందం తెలంగాణలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ తీసుకుంటారు.." అని కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read: GST On Hostels: హాస్టల్స్, పీజీలో ఉంటున్న వారికి బ్యాడ్‌న్యూస్.. ఫీజుల మోత తప్పదా..?
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి