తెలంగాణ జేఏసీ పదవికి కోదండరామ్ రాజీనామా
తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ పదవికి ప్రొఫెసర్ కోదండరామ్ ఈ రోజు రాజీనామా చేశారు. అయితే తన పార్టీ తెలంగాణ జనసమితికి ఈ సంస్థతో అనుబంధం ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని.. వారితో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు.

తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితికి సాధ్యమైనంత వరకు తాను స్థాపించిన రాజకీయ పార్టీ సహకారం కూడా ఉంటుందని.. ఇక కొత్త జేఏసీ చైర్మన్ విషయంపై స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటారని కోదండరామ్ తెలిపారు. కోదండరామ్ రాజీనామా చేయడంతో ప్రస్తుతానికి తెలంగాణ జేఏసీ కన్వీనర్‌గా రఘు బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర సాధననే ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ టీజేఏసీ, టీఆర్‌ఎస్ పార్టీలు కలిసి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందంటూ కోదండరామ్ కామెంట్ చేశాక, ఆ పార్టీతో ఆయనకు విభేదాలు వచ్చాయి.
ఈ క్రమంలో కోదండరామ్ టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పార్టీని స్థాపించారు. అయితే కోదండరామ్‌ని కొందరు టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ఏజెంట్ అని అభివర్ణించారు. ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణలకు పాల్పడవద్దని చెప్పడంతో పాటు కొలువుల కొట్లాట నిరసనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అప్పట్లో కోదండరామ్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. హైకోర్టుని ఆశ్రయించి మరీ అనుమతి తెచ్చుకున్నారు.