Komatireddy Brothers:తమ్ముుడు జంప్.. మరి అన్న దారెటు! మూడేళ్లుగా బీజేపీతో కోమటిరెడ్డి బిజినెస్ డీల్స్?
Komatireddy Brothers:తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల పోటాపోటీ వ్యూహాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. వలసలు జోరందుకున్నాయి. చేరికల కోసమే ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను గుర్తించి తమ పార్టీలో చేరేలా ప్రయత్నిస్తున్నాయి.
Komatireddy Brothers:తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల పోటాపోటీ వ్యూహాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. వలసలు జోరందుకున్నాయి. చేరికల కోసమే ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను గుర్తించి తమ పార్టీలో చేరేలా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన బీజేపీ అగ్రనాయకత్వం.. ఒక్కొక్కటిగా తమ అస్త్రాలను బయటికి తీస్తోంది. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ లోని బలమైన నేతలకు గాలం వేస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం జెండా కప్పుకున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరారైందని తెలుస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతుండటంతో ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది చర్చగా మారింది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వడంతో బహిరంగంగానే తన అసమ్మతి వినిపించారు. 30 కోట్ల రూపాయలకు పీసీసీ పదవి అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటదనే ప్రచారం సాగింది. కాని తర్వాత కొంత కూల్ అయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా నియమించడంతో అంతా సర్ధుకుందని అనుకున్నారు. అయితే కొన్ని రోజులుగా మళ్లీ తన మార్క్ చూపిస్తున్నారు వెంకట్ రెడ్డి. తన అనుచరులను ఏకంగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. తుంగతుర్తిలో వడ్డేపల్లి రవి, జడ్చర్లలో అనిరుధ్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది.
సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతుండటంతో వెంకట్ రెడ్డి ఏం చేయబోతున్నారన్నది ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతగా ఉంటున్న వెంకట్ రెడ్డి కూడా తమ్ముడి బాటలోనే బీజేపీలో చేరుతారా అన్న చర్చలు జరుగుతున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ తోనూ వెంకట్ రెడ్డికి మంచి సంబంధాలు ఉండేవి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ గులాబీ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం సాగింది. దీంతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నందున... వెంకట్ రెడ్డి కూడా బయటికి వెళ్లిపోతారనే వాదన కొన్ని వర్గాల నుంచి వస్తోంది. అయితే ఆయన బీజేపీకి వెళతారా లేక టీఆర్ఎస్ గూటికి చేరుతారా అన్నది తేలడం లేదంటున్నారు. వెంకట్ రెడ్డి అనుచరులు మాత్రం రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినా తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని చెబుతున్నారు. అయితే కోమటిరెడ్డికి ఎక్కడికక్కడ చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని.. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కష్టమేనని అంటున్నారు.
మరోవైపు అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం తర్వాత మరికొన్ని సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. అమిత్ షా , రాజగోపాల్ రెడ్డి సమావేశానికి జార్ఖండ్ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మధ్యవర్తిత్వం వహించారని తెలుస్తోంది. వ్యాపారవేత్త అయిన నిషికాంత్ దూబే కు రాజగోపాల్ రెడ్డి బెస్ట్ ఫ్రండ్. ఇద్దరూ కలిసి పలు వ్యాపారాలు చేశారని చెబుతున్నారు. అంతేకాదు గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని పనులను రాజగోపాల్ రెడ్డి సంస్థలకు ఇచ్చారని తెలుస్తోంది. ఉత్తరాధి రాష్ట్రాలలో రాజగోపాల్ రెడ్డికి చెందిన కాంట్రాక్ట్ సంస్థలు కేంద్ర సర్కార్ కు సంబంధించిన పనులు చేస్తున్నాయని చెబుతున్నారు. గత ఎన్నికల తర్వాత ఆర్థికంగా కొంత వీకైన రాజగోపాల్ రెడ్డికి బీజేపీ అండగా నిలిచిందని అంటున్నారు. బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లడం వల్లే కోమటిరెడ్డికి ఆ కాంట్రాక్టులు దక్కాయని తెలుస్తోంది. అప్పుడే బీజేపీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి డిసైడ్ అయినా... బీజేపీ పెద్దలే వ్యూహాత్మకంగా ఆయన చేరిక వాయిదా వేశారని సమాచారం. తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర పెద్దలు అలా వ్యవహరించారని తెలుస్తోంది కాషాయ కండువా కప్పుకోకపోయినా గత ఏడాదిన్నరగా బీజేపీకి మద్దతుగా రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గానే ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా బీజేపీ పెద్దల పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని అంటున్నారు. జార్ఖండ్ ఎంపీ నిషికాంత్ దూబేతో పాటు మరికొందరు బీజేపీ ఎంపీలతో చాలా కాలంగా రాజగోపాల్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తోంది.
Read also: Hyderabad Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. బయటికి రావొద్దని పోలీసుల హెచ్చరిక
Read also: CBSE 12th results 2022: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook