Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరణిమాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు వారాల్లోనే కాంగ్రెస్‌ నుంచి తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి చేరడం సంచలనం రేపింది. మిగతా ఎమ్మెల్యేలు కూడా గులాబీ పార్టీలో చేరుతారని వార్త కలకలం రేపడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయనతోపాటు మాజీ మంత్రులు జగదీశ్వర్‌ రెడ్డి, మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Revanth vs Tollywood: నా మాటలకే స్పందన ఇవ్వరా? సినీ పరిశ్రమపై మళ్లీ రేవంత్‌ రెడ్డి అసంతృప్తి


'ఛాంబర్‌కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లా? కేటీఆర్ కూడా నా కుర్చీ దగ్గరకు వచ్చి మాట్లాడాడు.. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లేనా? బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్లడు. జగదీష్ రెడ్డి నేను అన్న మాటలకు అంగీకరించాడు' అని తెలిపారు. ఇక రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. 'ఆయన విదేశాలకు వెళ్తే.. నేను ఉన్నాగా చూసుకోవడానికి. బీఆర్ఎస్ పార్టీకి నేను చాలు' అని పేర్కొన్నారు. 'త్వరలో ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర రహదారుల  కోసం నిధులు అడుగుతా. బీఆర్ఎస్ పార్టీ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు రాయితీ ఇస్తాం. ఉప్పల్ - నారపల్లి ఫ్లై ఓవర్‌కు త్వరలోనే రీ టెండర్. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడతాం' అని తెలిపారు.

Also Read: Rajashekhar: సినీ హీరో రాజశేఖర్‌ సంచలనం.. ట్విటర్‌లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీత


 


రుణమాఫీపై విస్మయం
అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయమై కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 'ఒకేసారి రుణమాఫీ చేస్తాం అని.. విడుతల వారీగా చేయడం ఏమిటి. ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం. కట్టని చేవెళ్ల ప్రాజెక్టుకు వాళ్లు తొమ్మిదిసార్లు శంకుస్థాపనలు చేశారు. అసలు ప్రాజెక్టు కట్టకుండా నే కాలువలు తవ్విన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ప్రజా సొమ్ము దుర్వినియోగం అని మహారాష్ర్ట సీఎం నాడు లెటర్ కూడా రాశారు. కాంగ్రెస్ పార్టీ ఆ పాత వారసత్వం కొనసాగిస్తోంది' అని జగదీశ్వర్‌ రెడ్డి విమర్శించారు.


ఒక్కడినే గెలిచిన: మల్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిపై వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్‌లో మంత్రి పదవి విషయమై స్పందించారు. 'హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో 34 మందిలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను. నన్ను ఎలా వదులుకుంటారు. ఆషాఢం తరువాత అవకాశం ఉంటుంది అని ఆశ. రాష్ట్ర జనాభాలో సుమారు 40శాతం ఇక్కడే ఉంది' అని పేర్కొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter