యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా ఇంతమంది కార్మికులు చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదని ఆరోపిస్తూ.. కేసీఆర్‌ మనిషి రూపంలో ఉండే ఓ రాక్షసుడని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ విధించిన డెడ్‌లైన్‌కు కనీసం 300 మంది కార్మికులు కూడా స్పందించలేదని ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. ఈ నెల 9న చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేసి సమస్య తీవ్రత ఏంటో ప్రభుత్వానికి తెలిసొచ్చేలా చేస్తామన్నారు.


కేసీఆర్ పరిపాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కోమటిరెడ్డి.. తెలంగాణ వచ్చాక రాష్ట్రం అప్పు రూ.2లక్షల కోట్లకు చేరిందని ఆరోపించారు. ఈ నెల 9న చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేస్తామన్నారు.