Komatireddy Venkat Reddy to KTR: ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారుతున్నట్టుగా మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన ఒక రాజకీయ జిమ్మిక్కు మాత్రమే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొట్టిపారేశారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకోవడం రాజకీయాల్లో హుందాతనం అనిపించుకోదు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కి హితవు పలికారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో మా ఐక్యతకు రాహుల్ గాంధీ చేపట్టిన @bharatjodo యాత్రే నిదర్శనం అని అభిప్రాయపడ్డారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఇదిలావుంటే, ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోపాటు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ వంటి కీలక నేతలు సైతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి మాట్లాడుతూ సానుకూల ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని, తామంతా కలిసే పని చేయబోతున్నామని పీసీసీ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొద్దిగంటల్లోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా స్పందిస్తూ ఈ ప్రకటన చేయడంతో ఆయన పార్టీ మార్పు అంశంపై మరోసారి క్లారిటీ వచ్చినట్టయింది.


Also Read : Malla Reddy Liquor Party: ఓటర్లకు మందు పోస్తున్న మంత్రి మల్లారెడ్డి.. ఫోటోలు, వీడియోలు వైరల్


Also Read : Gadder Munugode Contest: గద్దర్ పోటీతో గండం ఎవరికి? మునుగోడు ఉపసమరంలో కోవర్టులున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి