Komatireddy Venkat Reddy Sensational Comments: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియమించబడ్డప్పటి నుంచి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన నాయకత్వాన్ని సవాల్ చేస్తూనే ఉన్నారు. ఒకరకంగా రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. సాధారణంగా టీపీసీసీ చీఫ్ నిర్ణయం మేరకు పార్టీలో కార్యక్రమాలు అమలు జరగాలి.కానీ కోమటిరెడ్డి మాత్రం తన సొంత కార్యాచరణతో ముందుకు వెళ్లే యోచనలో ఉన్నారు.రేపటి నుంచి తానేంటో చూపిస్తానని... కామారెడ్డిలోని ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలుపెట్టబోతున్నానని తాజాగా ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కామారెడ్డి జిల్లా లింగంపేటలో మృతి చెందిన రైతు చిన్న బీరయ్య కుటుంబాన్ని పరామర్శిస్తానని కోమటిరెడ్డి తెలిపారు. ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు.రేపటి నుంచి తన ఉద్యమ కార్యాచరణ మొదలవుతుందన్నారు. కాంగ్రెస్ అంటే ప్రాణమిచ్చే వీహెచ్ లాంటి నేతలంటే తనకెంతో గౌరవమన్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవత అని... హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వస్తుందని ఎవరైనా ఊహించారా అని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాగా లేదని... పార్టీని ఎలా బతికించుకోవాలో ఆలోచిస్తున్నామని చెప్పారు.


Also Read: Vikram - The First Glance : విక్రమ్ - ది ఫస్ట్ గ్లాన్స్ చూశారా ?


హుజురాబాద్‌లో ఘోర పరాజయంపై కోమటిరెడ్డి సహా కాంగ్రెస్ సీనియర్లంతా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఫైట్‌ను లైట్ తీసుకోవడమే గాక ఈటల గెలుపుకు రేవంత్ సహకరించారనే ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేస్తానని ఇదివరకే కోమటిరెడ్డి పేర్కొన్నారు.కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు... రేవంత్ పగ్గాలు చేపట్టాక కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదనే సంకేతాలిచ్చినట్లయింది. రేవంత్ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టినప్పుడే.. దమ్ముంటే హుజురాబాద్ ఉపఎన్నికలో డిపాజిట్ తెచ్చుకోవాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. 


ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడంతో రేవంత్‌పై ఆయన మరింత స్వరం పెంచుతున్నారు. రేవంత్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ ఆయనతో కలవని కోమటిరెడ్డి తన దారి తనదేనని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు తన సొంత కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తానని చెబుతున్నారు. ఈ పరిణామాలను రేవంత్ ఎలా డీల్ చేయబోతున్నారు... కోమటిరెడ్డి సహా సీనియర్లను ఎలా దారికి తెచ్చుకుంటారో వేచి చూడాలి.


Also Read: 3 Roses Teaser: విమర్శలపాలవుతున్న 3 రోజెస్ టీజర్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook