Hindi Talent Test in Telangana: జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మందుల వర్షిణి హిందీ టాలెంట్ టెస్ట్‌లో సత్తా చాటింది. తెలంగాణవ్యాప్తంగా నేషనల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన హిందీ టాలెంట్ టెస్ట్‌లో వర్షిణి రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ దక్కించుకుంది. పోటీ పరీక్షలో చక్కటి ప్రతిభ కనబర్చిన వర్షిణికి నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సినీ దర్శకులు ఆర్.నారాయణమూర్తి పురస్కారాన్ని అందజేశారు. అవార్డుతో పాటు రూ.3వేల నగదు బహుమతిని అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మందుల వర్షిణి కోరుట్లలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ హైస్కూల్‌లో ఆరో తరగతి చదువుతోంది. హిందీ టాలెంట్ టెస్ట్‌లో వర్షిణి సత్తా చాటడంపై సరస్వతి శిశు మందిర్ స్కూల్ యాజమాన్యంతో పాటు ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే కోరుట్ల శిశు మందిర్ హైస్కూల్‌కి చెందిన మానుక హాసిని అనే మరో విద్యార్థిని హిందీ టాలెంట్ టెస్ట్‌లో మూడో స్థానంలో నిలవడం విశేషం. మందుల వర్షిణి, హాసినిలను శిశుమందిర్ స్కూల్ టీచర్స్ బృందం అభినందించింది. 


Also Read: Hyderabad Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు షీ టీమ్స్ 2కె, 5కె రన్.. అమలులోకి ట్రాఫిక్ ఆంక్షలు


Also Read: Horoscope Today March 5 2022: రాశి ఫలాలు.. వివాహ విషయంలో ఆ రాశి వారికి కీలక సూచన..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook