Horoscope Today March 5 2022: రాశి ఫలాలు.. వివాహ విషయంలో ఆ రాశి వారికి కీలక సూచన..

Horoscope Today March 5 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ అనుకూల సమయం కాగా, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల సమయం. సహనం, పెద్దల ఆశీస్సులు, ఆచీ తూచీ తీసుకునే నిర్ణయాలు కలిసొస్తాయి. కొన్ని రాశుల వారు ఇవాళ ఎంత ప్రయత్నించినా ఆశాజనకంగా ఉండవకపోవచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2022, 06:24 AM IST
  • నేటి రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే
  • కొన్ని రాశుల వారికి పూర్తిగా అనుకూల సమయం
  • కొన్ని రాశుల వారికి పూర్తి నిరాశజనకంగా ఉంటుంది
Horoscope Today March 5 2022: రాశి ఫలాలు.. వివాహ విషయంలో ఆ రాశి వారికి కీలక సూచన..

Horoscope Today March 5 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ అనుకూల సమయం కాగా, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల సమయం. సహనం, పెద్దల ఆశీస్సులు, ఆచీ తూచీ తీసుకునే నిర్ణయాలు కలిసొస్తాయి. కొన్ని రాశుల వారు ఇవాళ ఎంత ప్రయత్నించినా ఆశాజనకంగా ఉండవకపోవచ్చు.

మేషరాశి ( Aries) 

ఇవాళ మీ తోబుట్టువులు, బంధువులతో తలెత్తిన వివాదాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఆ పనుల్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. తోబుట్టువుల సాయంతో కొత్త పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటారు. తద్వారా మీ కుటుంబ వ్యాపారం పురోగతి చెందవచ్చు. మీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. 

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీకు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతాయి. కొన్ని విషయాల్లో సహనం కోల్పోతారు. మీ అహంకారపూరిత ధోరణితో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మీ జీవితం ఎక్కడో ఆగిపోయినట్లుగా దిగులుగా ఉంటారు. పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. ప్రేమికులు అనవసర విషయాలపై చర్చలు చేయవద్దు. పెద్దల ఆశీర్వాదంతో కొంత గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడొచ్చు.

మిథున రాశి (GEMINI)

చేస్తున్న పనులపై సరిగా దృష్టి పెట్టలేకపోతారు. అయితే మీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన వనరులను సులువుగా సమకూర్చుకోగలుగుతారు. తద్వారా ప్రాజెక్టును పూర్తి చేయడం సులువవుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. గతంలో మీరు చవిచూసిన నష్టాలు ఇప్పుడు ప్రాఫిట్స్‌తో భర్తీ అవుతాయి. తద్వారా ఆర్థికంగా బాగుంటుంది. పెద్దల ఆశీర్వాదం కలిసొస్తుంది.

కర్కాటక రాశి (Cancer) 

ఇవాళ ఓ కొత్త క్లైంట్ ద్వారా భారీ ఆర్డర్ అందుతుంది. తద్వారా మీ బిజినెస్‌లో లిక్విడిటీ పెరుగుతుంది. ఇవాళ ఓ ప్రభావవంతమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. అతనితో భేటీ మీ వ్యాపార పెరుగుదలకు దోహదపడవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూల సమయం. బాస్‌తో సంబంధం మరింత బలపడుతుంది. మీ హార్డ్ వర్క్ కారణంగా ప్రమోషన్ దక్కే అవకాశం. మీ ప్రతిష్ఠ మునుపటి కన్నా పెరుగుతుంది.

సింహ రాశి (LEO)

ఇవాళ మీరు ఏదేని పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. అంతేకాదు, ఆధ్యాత్మికపరంగా ఇవాళ మీరు కొంత డబ్బును విరాళంగా ఇస్తారు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదంతో మీ ఆలోచనా ధోరణి సక్రమంగా ఉంటుంది. ఈరోజంతా సంతోషంగా, పెద్ద హడావుడి లేకుండా గడుస్తుంది. 

కన్య రాశి (Virgo)

ఇవాళ మీ మూడ్ అంత బాగుండకపోవచ్చు. కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అది మీ పనిపై ప్రభావం చూపిస్తుంది. ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అది మిమ్మల్ని మరింత సున్నిత మనస్కులుగా మారుస్తుంది. అడ్వెంచర్స్‌కి, రాష్ డ్రైవింగ్‌కి దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించే అవకాశం. భగవాన్ నామస్మరణ లేదా ఏదైనా శ్లోకాలు పఠించడం ద్వారా కొంత ఉపశమనం పొందుతారు.

తులా రాశి (Libra)

ఇవాళ మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. తద్వారా మీ దాంపత్యం మరింత బలపడుతుంది. కొన్ని రకాల కళాకృతుల కొనుగోలుకు డబ్బును వెచ్చిస్తారు. లేదా ఇంటిని బాగుచేసేందుకు అవసరమైన మెటీరియల్‌ కొనుగోలు చేస్తారు. పార్టీలు, ఈవెంట్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. పెట్టుబడులు పెట్టేముందు దానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను క్షుణ్ణంగా చదవడం మరవకండి. 

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళ మీకు కలిసొస్తుంది. రోజంతా హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. మిమ్మల్ని మీరు విశ్లేషించుకుని ముందుకు సాగుతారు. తద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ రకమైన సవాళ్లనైనా స్వీకరించేందుకు వెనుకాడరు. వ్యాపారానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకోవాలి. ప్రేమికులు సంతోషంగా గడుపుతారు.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఇవాళ మీరు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. అయితే మీ ఉత్సాహాన్ని కాస్త నియంత్రించుకోవాల్సి ఉంటుంది. స్వీయ విశ్లేషణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలరు. సమాజంలో మీ గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్‌తో చాలా సమస్యలను పరిష్కరించుకోగలరు. విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించిన ప్లాన్స్‌లో నిమగ్నమై ఉంటారు. 

మకర రాశి (Capricorn) 

ఇవాళ అటు వృత్తిపరంగా, ఇటు కుటుంబపరంగా మీకు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. మీ జీవిత భాగస్వామితో అహంకారపూరితంగా ప్రవర్తించడం మానుకోండి. లేనిపక్షంలో అది మీ వైవాహిక బంధంపై ప్రభావం చూపిస్తుంది. వ్యాపార భాగస్వామితో వివాదాలు పరిష్కారమవుతాయి. సింగిల్స్ వివాహానికి సంబంధించిన విషయాల్లో హడావుడి పడవద్దు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఓపికతో ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

కుంభ రాశి (Aquarius)

వ్యాపారంలో మీ ప్లాన్స్‌ను విజయవంతంగా అమలుచేస్తారు. సోషల్ గెట్ టు గెదర్ లేదా ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లో పాల్గొంటారు. అది మీ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయవచ్చు. షార్ట్ బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేసే అవకాశం. తద్వారా భవిష్యత్తులో మీ వ్యాపారం పురోగతి చెందవచ్చు. అకడమిక్ రంగంలో ఉన్నవారికి కీలక నిర్ణయాలకు అనువైన సమయం.  

మీన రాశి (Pisces) 

ఇవాళ మీకు అనుకూల సమయం. ఆర్థికంగా బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. తద్వారా సేవింగ్స్ పెంచుకోండి. ప్రేమలో ఉన్నవారు మీ పార్ట్‌నర్‌తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఒకరి పట్ల ఒకరు గౌరవంతో మెలగండి. లేనిపక్షంలో అనవసర మనస్పర్థలు మీ మధ్య దూరం పెంచుతాయి. 

Also read: Polavaram Project: పోలవరం నిర్వాసితుల కాలనీ సౌకర్యాలపై కేంద్రమంత్రి ప్రశంసలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News