KT Rama Rao vs Revanth US Tour: పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనకు వెళ్లిన రేవంత్‌ రెడ్డి బృందంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో అన్ని షెల్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. రేవంత్‌ కుటుంబసభ్యులకే చెందిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కొన్ని కంపెనీల వివరాలను ప్రస్తావించారు. ఈ మేరకు రేవంత్‌ అమెరికా పర్యటనపై ఎక్స్‌ వేదికగా కీలక పోస్టు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Raja Singh Letter: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజా సింగ్‌ లేఖ


 


'పెట్టుబడుల పేరిట షెల్‌ కంపెనీలు, స్కాంగ్రెస్‌ ఎత్తుగడలతో ప్రజలను మోసగిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి సోదరుడు నెల రోజుల్లో పెట్టిన స్వచ్ఛ్‌ బయో కంపెనీ ఇదే కోవలోనిదే. ఇది ఆరంభం మాత్రమే! ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ పెట్టుబడిలు చేసుకున్న కంపెనీల వివరాలు వెల్లడించిన పార్టీ సీనియర్‌ నాయకుడు మన్నె క్రిశాంక్‌ వెలుగులోకి తెచ్చిన అంశాలను కేటీఆర్‌ ప్రస్తావించారు. ఈ సందర్భంగా క్రిశాంక్‌ను కేటీఆర్‌ అభినందించారు.

Also Read: Cyber Recovery: శెభాష్‌ తెలంగాణ సైబర్‌ పోలీస్‌! సైబర్‌ చోరీకి గురయిన ప్రజల సొత్తు భారీగా రికవరీ


 


క్రిశాంక్‌ ఆరోపణలు
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మన్నె క్రిశాంక్‌ కీలక విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ బృందం అమెరికాలో చేసుకున్న కంపెనీల ఒప్పందాల గుట్టు విప్పారు. ఈ సందర్భంగా కీలక ఆరోపణలు చేశారు. 'అమెరికా పర్యటనలో రూ.వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకున్న స్వచ్ఛ్‌ బయో కంపెనీ రేవంత్ రెడ్డి సొంత కుటుంబానిది. ఆ కంపెనీ మొదటి డైరెక్టర్‌ వేదవల్లి శివానంద రెడ్డి. యూపీలో మెస్సే బార్ నిర్వాహకులు. రెండో డైరెక్టర్ ఎనుముల జగదీశ్ రెడ్డి. ఈయన రేవంత్ రెడ్డి సోదరుడు. ఒప్పందం సమయంలో వారిద్దరూ లేరు. కానీ హర్ష పసునూరి అనే వ్యక్తి ఉన్నారు. ఆయన హర్ష పసునూరి అనే వ్యక్తి సీఎం సోదరుడి బినామీ' అని కీలక విషయాలు తెలిపారు.


'స్వచ్ఛ్‌ బయో కంపెనీ ఈ ఏడాది జూలైలో ఏర్పాటైందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ లేఖ ద్వారా తెలిసింది. ఆ కంపెనీకి రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకునేంత సత్తా లేదు' అని క్రిశాంక్‌ తేల్చి చెప్పారు. ఇక వాల్ష్ కర్రా కంపెనీతో చేసుకున్న రూ.830 కోట్ల ఒప్పందంపై కూడా మాట్లాడారు. ఆ కంపెనీకి కూడా ఊరు పేరు లేని కంపెనీ అని పేర్కొన్నారు. రేవంత్‌ చేసుకునే ఒప్పందాల కంపెనీలన్నీ బోగస్ అని.. ఆ ఒప్పందాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు. తాము చెప్పిన వివరాలన్నీ నిజాలని.. ఎవరైనా ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter