Raja Singh Letter: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజా సింగ్‌ లేఖ

Raja Singh Letter To Chandrababu Naidu: వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడు సంచలనం రేపే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపారు. ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 6, 2024, 05:28 PM IST
Raja Singh Letter: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజా సింగ్‌ లేఖ

Raja Singh Letter To Chandrababu: హిందూత్వాన్ని పూర్తిగా విశ్వసిస్తూ.. ఆ మత కార్యక్రమాల్లో మునిగి తేలుతున్న బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న సంఘటనలపై స్పందించారు. ఏపీలో జరుగుతున్న సంఘటనలపై కలత చెంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మీ రాష్ట్రంలో జరిగే సంఘటనలనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Also Read: KTR Fire On Revanth: రేవంత్‌ రెడ్డి ఇదేనా ఇందిరమ్మ పాలన? థర్డ్‌ డిగ్రీ ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం

ఏపీలోని పురాతన ఆలయాలను ఇతర మతాల వారు ఆక్రమించుకుంటున్నారని రాజా సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల మొదలుకుని ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న దాడులు.. భూముల అన్యాక్రాంతం వంటి అంశాలపై లేఖల ప్రస్తావించారు. హిందూ దేవాలయాల వద్ద దుకాణాలు తెరిచి మత మార్పిడులు విస్తృతంగా జరుగుతున్నాయని ఆరోపించారు. హిందూ మతానికి విఘాతం కలిగేలా ఏపీలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని లేఖలో రాజా సింగ్‌ వివరించారు. అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబును విజ్ఞప్తి చేశారు. హిందూ ఆలయాలపై వెంటనే స్పందించాలని కోరారు.

Also Read: Telangana Rains: నిండుకుండల్లా ప్రాజెక్టులు.. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో వర్షాలు

 

గతంలోనే ఆందోళన
గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో హిందూ మత వ్యతిరేక కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయని రాజా సింగ్‌ గతంలో ఆరోపించారు. తిరుమల క్షేత్రంలో జరుగుతున్న విషయాలపై కూడా అప్పట్లోనే రాజా సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రథాల దగ్ధం.. హిందూ ఆలయాల్లో ధ్వంసంతోపాటు మత మార్పిడులపై విమర్శలు చేశారు. తాజాగా నేటి సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడం విశేషం. ఆలయాల పునరుద్ధరణ.. మత మార్పిడిలను అరికట్టడంపై చంద్రబాబుకు రాజా సింగ్‌ విజ్ఞప్తి చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News