KTR Kavitha Jail: ఢిల్లీ మద్యం కుంభకుణం కేసులో అరెస్టయి కొన్ని నెలలుగా జైలులో మగ్గుతున్న కల్వకుంట్ల కవితకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బెయిల్‌ లభించడం లేదు. పరిస్థితులు పగబట్టినట్టు ఆమెకు అన్ని ప్రతికూలంగా మారుతున్నాయి. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. బెయిల్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులో తన సోదరి ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: కుటుంబీకులకు దోచేందుకే రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు


 


హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం అనంతరం కేటీఆర్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ క్రమంలో కవిత జైలు జీవితంపై స్పందించారు. 'ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతున్న సమయంలో నేరం చేసినట్టు వార్తలు రాస్తుండడం బాధాకరం. బెయిల్‌ విషయమై న్యాయ నిపుణులతో చర్చలు జరిపాం. 3 అంశాల్లో ఢిల్లీ వెళ్లాం. కవిత బెయిల్, ఎమ్మెల్సీల అనర్హత, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులాంటివి మాట్లాడేందుకు వెళ్లాం. కొద్ది వారాల్లో బెయిల్ వస్తుందని నమ్ముతున్నా' అని కేటీఆర్‌ తెలిపారు.


Also Read: Raja Singh Letter: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజా సింగ్‌ లేఖ


 


తీవ్ర అనారోగ్యం
ఇక జైలులో కవిత ఎదుర్కొంటున్న పరిస్థితులు వివరించారు. 'పాత జైలు (తిహార్‌ జైలు) కదా. అక్కడ వసతులు బాగా లేవు. ఎక్కువ లైట్స్ వేస్తున్నారు. వసతులు బాగాలేవు. కవిత ఇబ్బంది పడుతుంది. గైనిక్ ప్రాబ్లమ్ ఎదుర్కొంటోది. ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి' అని కేటీఆర్‌ తెలిపారు. అంతకుముందు కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో సుంకిశాల ప్రమాదంపై మాట్లాడారు.


రేవంత్ వైఫల్యమే
'హైదరాబాద్‌కు 50 ఏళ్ల పాటు తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు సుంకిశాల ప్రాజెక్ట్ ప్రారంభించాం. రూ.2,250 కోట్ల వరకు అనుమతులు ఇచ్చి ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు చేశాం. కాంగ్రెస్ పార్టీ తప్పిద్ధం వల్లనే సుంకిశాల ప్రాజెక్ట్ కుంగింది. ఆగస్టు 2వ తేదీ ఉదయం సుంకిశాల ప్రాజెక్ట్ కుంగితే ఎందుకు బయటపెట్టలేదు' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్ట్ కుంగడం రేవంత్‌ రెడ్డి వైఫల్యమేనని స్పష్టం చేశారు. మున్సిపల్  శాఖ అతడి దగ్గరే ఉందని.. పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter