KT Rama Rao: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఇచ్చి ఆశీర్వదించిన హైదరాబాద్‌ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం అవుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా అయిన కిషన్‌ రెడ్డి ఐదేళ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు, తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క రూపాయి కానీ.. అదనపు ప్రాజెక్టు.. అదనపు నిధులు కానీ ఏం లేవని తెలిపారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KCR Press Meet: 'కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిని వెలిగించడానికి రాదా?' రేవంత్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం


 


హైదరాబాద్‌లోని అంబర్‌పేట నియోజకవర్గంలోని పటేల్ నగర్, ప్రేమ్ నగర్, ఆజాద్ నగర్, పటేల్ వాడల్లో కేటీఆర్‌ పర్యటించారు. బస్తీలో పాదయాత్రగా ఇంటింటికి వెళ్లి పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం, కిషన్‌ రెడ్డి చేసిన తప్పిదాలు, మోసాలు వివరించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన తర్వాత కిషన్‌ రెడ్డి అదృష్టవశాత్తు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఆయన అంబర్‌పేటకు, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌కు చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పారు.

Also Read: KCR Bus Checkup: పొలంబాటలో కేసీఆర్‌కు ఈసీ షాక్‌.. బస్సు అణువణువు తనిఖీ


 


దమ్ముంటే కిషన్ రెడ్డి ఐదేళ్లలో తీసుకువచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. తాను చేసిన పనులు చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడగాలని చాలెంజ్‌ చేశారు. గత ఎన్నికల్లో అనుకోకుండా గెలిచిన కిషన్ రెడ్డి ఈసారి ప్రజల చేతులు తిరస్కారానికి గురవుతారని జోష్యం చెప్పారు. సికింద్రాబాద్‌ ఎంపీగా ఆయన ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. పదేళ్లలో హైదరాబాద్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకుని కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పద్మారావు గౌడ్‌ను సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. గెలిచిన తర్వాత ఢిల్లీకి పర్యటనలు చేసే నాయకులను కాకుండా.. నిత్యం అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్‌ను ఎంపీగా గెలిపించాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా మారిన హైదరాబాద్‌లో ఈసారి కూడా గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఎంపీ పద్మారావు గౌడ్‌ భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook