Telangana Emblem: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా రాజముద్రలు మారుస్తుండడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. వెంటనే మూర్ఖపు నిర్ణయాలను విరమించుకోవాలని హితవు పలికారు. తెలంగాణకు ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్‌ చిహ్నాం యథావిధిగా ఉంచాలని డిమాండ్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mahabubnagar Lok Sabha: పాలమూరులో గెలుపెవరిది? డీకే అరుణా? లేదా వంశీదా? బీఆర్‌ఎస్‌ పార్టీ పాత్ర ఏమిటీ?


కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్‌ చిహ్నం మారుస్తుందనే వార్తలతో తెలంగాణ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. యావత్‌ తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. రాజముద్రలో ప్రధాన చిహ్నామైన చార్మినార్‌ వద్ద కేటీఆర్‌ గురువారం నిరసన చేపట్టారు. చార్మినార్‌ను సందర్శించిన అనంతరం అక్కడ మాట్లాడుతూ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Police Lathi Charge: రైతులపై లాఠీచార్జ్‌ చేయడమే మార్పా? కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం


'పదేళ్లలో ప్రభుత్వంలో మంచి జరిగితే దాని గురించి ప్రజలకు చెప్పాలి. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా వ్యవహరిస్తోంది. పదేళ్లలో జరిగిన మంచిని, అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ దుగ్ద, కక్షతో వ్యవహరిస్తోంది' అని కేటీఆర్‌ మండిపడ్డారు. పదేళ్లలో ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాలని తెలిపారు. కానీ రేవంత్‌ రెడ్డి మూర్ఖపు నిర్ణయాలతో ఉత్సవాలు రణరంగంగా మారుతున్నాయని పరోక్షంగా తెలిపారు.


'పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా మూర్ఖ, మొండి వైఖరితో కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. కేసీఆర్‌కు పేరు రావొద్దొని.. కేసీఆర్‌ పేరు వినబడవద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది' అని కేటీఆర్‌ మండిపడ్డారు. 'తెలంగాణ అనగానే హైదరాబాద్, వరంగల్ గుర్తొస్తాయి. కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణం. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం' అని తెలిపారు.


'చార్మినార్‌ను తొలగించడమంటే ప్రతి హైదరాబాదీని అవమానించినట్టే. ప్రతి ఒక్కరిని అగౌరవపరిచినట్టే' అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 'తమ బతుకులు మార్చామని.. పథకాలు అమలుచేయాలని.. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని ప్రజలు ఎన్నుకున్నారు' అని గుర్తు చేశారు. 'ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దని' కేటీఆర్‌ హితవు పలికారు.


'తెలంగాణ షాన్ హైదరాబాద్. హైదరాబాద్ ప్రతీక చార్మినార్. హైదరాబాద్ అంటే దాని ప్రతీక చార్మినార్ అన్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది' అని కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని ఇప్పుడు తీసేయాల్సిన అవసరం.. అంత తొందర ఏమీ వచ్చింది' అని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కేటీఆర్‌ హెచ్చరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి