Bucchamma Family: భవనాలు కూల్చివేస్తామని బెదిరిస్తున్న హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామని మరోసారి భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. ఇది రేవంత్‌ రెడ్డి చేసిన హత్య అని సంచలన ప్రకటన చేశారు. తమకు ఓటేయలేదనే కోపంతో హైదరాబాద్‌ ప్రజలపై రేవంత్‌ రెడ్డి కోపం పెంచుకున్నారని విమర్శించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao: ఫ్యామిలీ ఫంక్షన్‌ను డ్రగ్స్‌ పార్టీ చెబుతారా..? బురద జల్లడమే రేవంత్‌ పని


హైడ్రా కూల్చివేతల భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబాన్ని కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, సంజయ్‌ కుమార్‌, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులతో కూడిన బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం పరామర్శించింది. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు అందించిన ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి కేటీఆర్‌ అందించారు.

Also Read: KTR Press Meet: అది ఇంట్లో చేసుకున్న దావతయ్యా.. బావ మరిది పార్టీపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు


కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. 'ప్రభుత్వం అవగాహనారాహిత్యంతో అర్థం పర్ధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. పేద మహిళ ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైంది. బుచ్చమ్మ ఆత్మహత్య ప్రభుత్వ హత్య' అని తెలిపారు. 'హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోంది. బుచ్చమ్మ ఆత్మహత్యపై ప్రభుత్వం సానుభూతి తెలిపిందా' అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలే ఇళ్లకు పర్మిషన్ ఇచ్చిందని గుర్తు చేశారు.


'రాష్ట్రంలో రాజ్యాంగం పేదలకు మాత్రమే ఉంటుందా? రేవంత్ రెడ్డి అన్నకు  నోటీసులు ఇచ్చి వదిలేశారు' అని కేటీఆర్‌ తెలిపారు. పది నెలల్లో ఒక్క ఇళ్లు అయినా కట్టారా అని ప్రశ్నించారు. హైడ్రాతో ఆర్ధిక శాఖా మంత్రికి ఏం పని? ఒకరిద్దరు బిల్డర్ల పేర్లు చెప్పి పైసలు వసూలు చేయాలని చూస్తున్నారు' అని ఆరోపించారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై రేవంత్ రెడ్డిపై హత్య కేసు పెట్టాలని సంచలన ప్రకటన చేశారు.


'హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. హైదరాబాద్ నగరం మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిందని రేవంత్ రెడ్డి కక్ష కట్టారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ తరపున న్యాయ సహాయం చేస్తాం' అని కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న భూముల దందాను బయటపడుతామని హెచ్చరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook