KT Rama Rao: హైడ్రా కూల్చివేతలపై ఉద్యమం చేపట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా హైడ్రా కూల్చివేతలకు కారణంగా కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ కారణమని సంచలన ఆరోపణలు చేశారు. మూసీ ప్రాజెక్టును డబ్బుల సంచుల కోసమే రేవంత్‌ రెడ్డికి రాహుల్‌ గాంధీ అనుమతించినట్లు వివరించారు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్ నడిపిస్తుండు' అని ఆరోపించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Twin Projects: ప్రమాదకరంగా మూసీ ప్రవాహం.. తెరచుకున్న హైదరాబాద్‌ సాగర్‌ ప్రాజెక్టులు


 


హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. విలేకరుల సమావేశం అనంతరం కేటీఆర్‌ చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మూసీ ప్రాజెక్ట్‌ను  రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసమే అనుమతి ఇచ్చాడు. రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీనే హైడ్రాను నడిపిస్తున్నాడు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల ఇండ్ల పైకి బుల్డోజర్ నడిపిస్తుండు. కేవలం డబ్బుల కోసమే రాహుల్ గాంధీ మూసీ ప్రాజెక్టు చేపట్టిండు' అని తెలిపారు.

Also Read: Flood Funds: తెలంగాణలో దుమారం రేపిన వరద నిధులు.. బీజేపీ వర్సెస్‌ గులాబీ పార్టీ


 


'హైదరాబాద్ నగరంలో బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు చచ్చిపోతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చిపోయాడు? తెలంగాణలో చిన్నపిల్ల గాడు పిలిచినా సరే వస్తాను అని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ సచ్చాడో చెప్పాలి' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 'ఢిల్లీ డబ్బుల కట్టల కోసమే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం పేదల ఇళ్లను కూల్చేయిస్తోంది. మీరు ఈ ప్రాజెక్ట్ ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో కూడా తెలుసు. ఆ వివరాలను త్వరలోనే బయటపెడతా' అని సంచలన ప్రకటన చేశారు.


'కాంగ్రెస్ అధిష్టానానికి మూసీ నోట్ల కట్టలు  కావాలి. కానీ మూసీ బాధితులు కష్టాలు పట్టవా? ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు. మూసీ లూటీఫికేషన్. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది. కేంద్రం, బీజేపీ పెద్దల ఒత్తిడితోనే ఆర్డినెన్స్‌కి గవర్నర్ అనుమతి ఇచ్చారు' అని కేటీఆర్‌ ఆరోపించారు. 'హైడ్రాపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి. ఇకటి, రెండు రోజుల్లో మూసీ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా' అని తెలిపారు. 'రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకి రూ.1,50,000 కోట్లు ఖర్చు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ కుంభకోణంపై వివరాలు వెల్లడిస్తా' అని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో మూసీ ప్రాజెక్టుపై ప్రజలకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని వెల్లడించారు.


'పేదల ఇండ్లకు నష్టం జరగకుండా మూసీని ఎలా ప్రక్షాళన చేయవచ్చో ప్రజలకు వివరిస్తాం. రేవంత్ రెడ్డి ఓ అభినవ గోబల్స్‌గా మారాడు. మూసీ నదికి ఇరువైపుల బంగారు తాపడం చేపిస్తే తప్ప రూ.లక్షన్నర కోట్లు ఖర్చు అవ్వదు. మూసీ ప్రాజెక్టుతో కాంగ్రెస్‌కి లాభం తప్ప సాధారణ ప్రజలకి ఒరిగేదీమీ లేదు. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయంటున్న మంత్రి ఎక్కడి నుంచి  ఉద్యోగాలు వస్తాయో చెప్పాలి' అని కేటీఆర్‌ ప్రశ్నిచారు.


*హైడ్రా, ఆర్‌ఆర్‌ పన్ను కారణంగా నగరంలోని రూ.35 లక్షల మంది కార్మికుల ఉపాధి పోయింది. మూసీలో పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకుగా తయారు చేసుకుంటోంది. 
పేదల ఇండ్లు కొట్టి ఖజానా నింపుకునేందుకు  కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనుకున్న సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు గంటల పాటు సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ  ప్రాజెక్టుపై 3 గంటలు కాదు మూడు నిమిషాలైనా చెప్పేవారు ప్రభుత్వంలో ఒక్కరైనా ఉన్నారా? ఒకరైన ప్రభుత్వంలో ఉన్నారా?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.


'ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి వణికిపోతాడు. అందుకే కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో భట్టితో మాట్లాడించారు. మూసీపైన ప్రభుత్వం వద్ద డీపీఆర్ లేదు. తులం బంగారం, పింఛన్లు రెట్టింపు చేయని రేవంత్ రెడ్డి ఎందుకు మూసీ ప్రాజెక్టు కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు' అని కేటీఆర్‌ ఆరోపించారు. రిపోర్టు లేదు.. సర్వే లేదు. ప్రాజెక్టు లేదు. వాటి ప్రయోజనాలు చెప్పే మనిషి లేడు. అయినా లక్షల  కోట్లు ఖర్చు పెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది' అని తెలిపారు. దొంగ చాటున సర్వేలు చేస్తుంటే.. లక్షల మంది ప్రజలకు ఇంట్లో పండుగ సంతోషం లేకుండా పోయిందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.